రీ రిలీజ్ కాబోతున్న చిరు గ్యాంగ్ లీడర్ సినిమా.. ఎప్పుడో తెలుసా..!?

Anilkumar
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చిరంజీవికి ఒక ప్రత్యేక స్థానం ఉంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. ఎందరో యువర్ నటీనటులకు స్ఫూర్తిగా నిలిచాడు చిరంజీవి. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ వద్ద ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్ గా సినీ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న అనంతరం తన తర్వాత సినిమాని తెరకెక్కించే పనిలో పడ్డాడు మెగాస్టార్ చిరంజీవి. 

దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో బోళాశంకర్ సినిమాలో నటించాడు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలవడంతో చిరంజీవి నటించిన ఓ వింటేజ్ బ్లాక్ బస్టర్ సినిమాని రీ రిలీజ్ చేసేందుకు చిత్రవర్గాలు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో చిరంజీవి మరియు విజయశాంతి జంటగా నటించిన మరియు విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్ లీడర్ సినిమాని ఎవరు మర్చిపోలేరు.

 ఈ సినిమాతో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రేంజ్ మరింత పెరిగింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. చేయి చూసావా ఎంత రఫ్ గా ఉందో రఫ్ ఆడిస్తాను అంటూ మెగాస్టార్ చిరంజీవి చెప్పిన డైలాగ్ను ఇప్పటికీ చెబుతూ ఉంటారు చాలామంది. ఇక ఈ సినిమాను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన ఒక పోస్ట్ ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: