టైగర్ నాగేశ్వరావు పై షాకింగ్ న్యూస్ !

Seetha Sailaja

వరస విజయాలతో దూసుకుపోతున్న రవితేజా యంగ్ డైరెక్టర్ వంశీ దర్శకత్వం వహిస్తున్న ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీని వీలైనంత త్వరలో పూర్తిచేసి ఆమూవీ ద్వారా హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మూవీలో రేణు దేశాయ్ కూడా కీలకపాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇలా ఉండగా ఈ మూవీకి సంబంధించి లేటెస్ట్ గా లీక్ అయిన న్యూస్ మాస్ మహారాజ అభిమానులలో మరింత జోష్ ను కలిగిస్తోంది.

తెలుస్తున్న సమాచారంమేరకు ‘టైగర్ నాగేశ్వరావు’ సినిమాలో రవితేజా మొత్తం మూడు కొత్త గెటప్ లలో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వాటిలో ఒకటి యంగ్ అండ్ డైనమిక్ లుక్ కాగా రెండో లుక్ లో  పెద్ద గడ్డంతో చాలా రఫ్ గా కనిపిస్తాడని తెలుస్తోంది. ఈ  రెండు లుక్ లు కాకుండా మరో లుక్  సర్ ప్రైజింగ్ గా ఉంటుందని  అంటున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించి ఒక భారీ పోరాట సన్నివేశాన్ని భారీగా ఖర్చు పెట్టి చిత్రీక రించి నట్లు  తెలుస్తోంది.


1970 కాలంలోని స్టువర్ట్ పురం నేపథ్యంలో ఈ సినిమా కథ ఉండబోతోంది. ఆ రోజులలో పేరు మోసిన గజదొంగ  టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ మూవీని దేశవ్యాప్తంగా విడుదలచేయబోతున్నారు. ‘ధమాకా’ సినిమాతో రవితేజా 100 కోట్ల హీరోగా మారడంతో అతడికి ఏర్పడినక్రేజ్ రీత్యా ఈ మూవీ బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

అంచనాలకు అనుగుణంగా ‘టైరగ్ నాగేశ్వరరావు’ మూవీ సూపర్ హిట్ అయితే రవితేజా కూడ టాప్ హీరోల లిస్టులోకి చేరిపోవడం ఖాయం. ప్రస్తుతం బయోపిక్ ల సీజన్ నడుస్తోంది కాబట్టి  ఈ మూవీ గురించి అంచనాలు పెరిగిపోతున్నాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ గురించి ఇప్పటికీ కథలు కథలుగా అతడి గురించి చెప్పేవారు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికీ ఉన్నారు. మరి ఈసినిమాకు ప్రేక్షకులు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: