టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎన్నో అందమైన
ప్రేమ కథల రూపంలో సినిమాలు వచ్చాయి. కానీ ఎప్పటికీ చెప్పుకునే
సినిమా పేరు అయితే కొత్త బంగారులోకం అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు.
టాలీవుడ్ సెన్సిబిలి
డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ
సినిమా తెరకెక్కింది. ఎవరు ఊహించిన విధంగా మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమాలో హీరోగా
వరుణ్ సందేశ్ హీరోయిన్గా శ్వేతా బసు నటించి అందరినీ ఆకట్టుకున్నారు. టీనేజ్
లవ్ స్టోరీగా ఈ
సినిమా మంచి విజయాన్ని సైతం అందుకుంది. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పటికి ఈ
సినిమా వస్తే టీవీలకే అతుక్కుపోయి ఈ సినిమాను చూస్తూ ఉంటారు.
అంతేకాదు ఈ సినిమాలోని పాటలను ఇప్పటికీ చాలామంది ఎంతో ఉత్సాహంతో వింటూ ఉంటారు. ఈ సంగీతం ఇప్పటికీ చాలామంది శ్రోతలను అలరిస్తోంది. ఇదిలా ఉంటే ఇక ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అదేంటండి అంటే.. ఈ సినిమాలో హీరోగా ముందుగా
వరుణ్ సందేశం అనుకోలేదట. ముందుగా ఈ సినిమాలో హీరోగా ఎవరిని అనుకున్నారో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు..
వరుణ్ సందేశ్ మరియు శ్వేతా బసు
హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో ముందుగా హీరోగా అక్కినేని
హీరో నాగచైతన్య ని అనుకుంటున్నారట. అయితే ఈ విషయాన్ని ఈ
సినిమా దర్శకుడు మరియు నిర్మాతలు నాగార్జునకి వినిపించారట.
దీంతో
నాగార్జున మాట్లాడుతూ నాగచైతన్యను
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తో లాంచ్ చేయాలన్నట్లుగా ఆదర్శక నిర్మాతలతో చెప్పాడు. అంతేకాదు
మాస్ స్టోరీ ఉంటేనే మీ బ్యానర్లో చేస్తామని
నాగార్జున చెప్పుకొచ్చాడట. దాని అనంతరం ఈ సినిమాలో హీరోగా ఎవరిని తీసుకోవాలి అని అనుకుంటున్న సమయంలో..
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పెరకెక్కిన
హ్యాపీడేస్ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన
వరుణ్ సందేశ్ ని చూసి వరుణ్ని చూసి..వరుణ్ ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ కి బాగా సెట్ అవుతాడని
దిల్ రాజు భావించాడట.
దిల్ రాజా భావించినందుకు గాను ఈ సినిమాలో హీరోగా
వరుణ్ సందేశం ఎంపిక చేశారట. అలా ఈ సినిమాలో
వరుణ్ సందేశ్ హీరోగా నటించాడు. ఇక ఈ సినిమాతో హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు
వరుణ్ సందేశ్.ఈ
సినిమా తర్వాత
నాగచైతన్య హీరోగా నటించిన
జోష్ సినిమా నిరాశపర్చిన సంగతి మనందరికీ తెలిసిందే ..!!