పఠాన్ @ 500 కోట్లు...?
ఇప్పటికే ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్‌గా రూ.200 కోట్ల గ్రాస్ ఈజీగా దాటి మూడో రోజుకి 300 కోట్లు వసూళ్లు రాబట్టినట్లుగా సమాచారం తెలుస్తుంది. ఇపుడు పఠాన్ సినిమాతో షారుక్ మార్క్ కలెక్షన్లపై ఇండస్ట్రీలో జోరుగా చర్చ నడుస్తోంది. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే షారుఖ్ ఖాన్ క్రేజ్‌తో పఠాన్ ఫస్ట్ ఈ వీకెండ్‌లో ఖచ్చితంగా రూ.400 కోట్ల గ్రాస్ దాటేస్తుందని సమాచారం తెలుస్తుంది. పఠాన్ ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యే సరికి సెకండ్ వీకెండ్ లోకి అడుగుపెట్టగానే ఖచ్చితంగా 500 కోట్ల క్లబ్‌లోకి కూడా ప్రవేశించి సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.కేవలం నాలుగు రోజుల్లోపే రూ.300 కోట్ల మార్క్‌కు సులభంగా చేరుకున్న పఠాన్‌కు 500 కోట్ల టార్గెట్ ని చేరుకోవడం కూడా పెద్ద విషయమేమి కాదని అభిప్రాయపడుతున్నారు బాలీవుడ్ సినీ జనాలు.మరి చూడాలి మన తెలుగు సినిమాలు బాలీవుడ్ లో నెలకొల్పిన రికార్డులను ఈ సినిమా బద్ధలు కొడుతుందో లేదో..