పఠాన్ సినిమా కోసం.. షారుఖ్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే?
ఇప్పుడు వరకు రొమాంటిక్ హీరోగా మాత్రమే గుర్తింపు సంపాదించుకున్న షారుక్ ఖాన్ ఇక పఠాన్ సినిమాతో తనలో ఉన్న యాక్షన్ యాంగిల్ కూడా చూపించేందుకు సిద్ధమయ్యాడు అని చెప్పాలి. స్పై థ్రిల్లర్ కథాంశం తో పఠాన్ సినిమా తెరకెక్కుతుంది అన్నది ఇక ఇటీవల విడుదలైన ట్రైలర్ ఆధారంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకున్నారు. ఇక ఈ సినిమా జనవరి 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది అని చెప్పాలి. హాలీవుడ్ రేంజ్ లో ప్రేక్షకుల ఊహకందని విధంగా ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి అన్నది మాత్రం తెలుస్తుంది.
250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా కోసం షారుక్ ఖాన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ప్రకారం 35 నుంచి 40 కోట్ల వరకు షారుక్ రెమ్యూనరేషన్ పుచ్చుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇంత తక్కువ తీసుకున్నాడా అనుకోకండి.. షారుక్ పారితోషకంతో పాటు సినిమా లాభాల్లో వచ్చే కొంత వాటా కూడా తీసుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడట. అందుకే రెమ్యూనరేషన్ తక్కువ ఉన్నప్పటికీ ఇక లాభాల్లో వాటా కారణంగా అంతకుమించి అనే రేంజ్ లోనే డబ్బులు సంపాదించే ఛాన్స్ ఉందట.