ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని తెలుగు లో వారసుడు పేరుతో విడుదల చేయనున్నట్లు కూడా చిత్ర బృందం కొన్ని రోజుల క్రితం ప్రకటించింది. అలాగే ఈ
మూవీ ని
తమిళ్ మరియు తెలుగు భాషలలో ఈ సంవత్సరం
జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు కూడా ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే చివరి నిమిషంలో ఈ
మూవీ యొక్క
తమిళ్ వర్షన్ ను
జనవరి 11 వ తేదీన విడుదల చేయనున్నట్లు ... తెలుగు వర్షన్ ను
జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అందులో భాగంగా ఈ
మూవీ యొక్క
తమిళ్ వర్షన్ ను నిన్న అనగా
జనవరి 11 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. మరి ఈ
మూవీ తమిళ్ వర్షన్ కు ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయో తెలుసుకుందాం.
తమిళనాడు లో ఈ
మూవీ కి 20.15 కోట్ల కలెక్షన్ లు దక్కగా , కర్ణాటక లో 5.62 కోట్లు , కేరళ లో 4.55 కోట్లు , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.15 కోట్లు , ఓవర్సీస్ లో 14.85 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈ
మూవీ కి 23.60 కోట్ల షేర్ , 46.32 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు లభించాయి. ఈ
మూవీ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయలేదు.