బాహుబలి విజయం వెనుక.. ఈయన పడిన కష్టం గురించి తెలుసా?
తెర వెనకాల దర్శక నిర్మాతలు మాత్రమే కాదు ఎంతోమంది చెమటోడ్చి కష్టపడతారు అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు అని చెప్పాలి.సాధారణంగా సినిమాలో కేవలం పాటలు మాత్రమే కాదు ప్రతి సన్నివేశంలో ఎన్నో రకాల సౌండ్స్ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా బాహుబలి లాంటి సినిమాల్లో ఒక గుర్రపు స్వారీ చేస్తున్న సమయంలో వచ్చే శబ్దాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. అయితే ఈ సీన్ చూస్తున్నప్పుడు ఆ సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తారు తప్ప దాని వెనుక శబ్దాలు సృష్టించేది ఎవరు అన్న విషయం గురించి ఎవరు ఆలోచించరు
అయితే ఇలా సినిమా సన్నివేశాలలో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే శబ్దాలు చేసే వారిని పోలి ఆర్టిస్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఇక వీరు సినిమాలోని ప్రతి సందర్భాన్ని బట్టి శబ్దాలు సృష్టించడం లాంటివి చేస్తూ ఉంటారు.దీనికోసం ఎంతగానో కష్టపడి పోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఎన్ని వందల కోట్లు ఖర్చుపెట్టినప్పటికీ ఇక పోలి ఆర్టిస్టు చేసే శబ్దాలు లేకుండా సినిమాను చూడటం మాత్రం దాదాపు జరగదు అని చెప్పాలి. ఇంతకీ పోలి ఆర్టిస్ట్ అంటే ఏంటో తెలుసా.. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపయోగించే వస్తువులతోనే సౌండ్ ఎఫెక్ట్స్ అందించడం.. ఇక ఈ పనులన్నీ కూడా ప్రీ ప్రొడక్షన్ లో పూర్తి చేస్తూ ఉంటారు. ఇక సినిమా పరిశ్రమలలో కరున్ అర్జున్ సింగ్ అనే వ్యక్తి పోలి ఆర్టిస్టుగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు 35 ఏళ్ల అర్జున్ సింగ్ ఇప్పటివరకు 3000 కంటే ఎక్కువ చిత్రాల్లో పనిచేశారు. ఇక మొబైల్లో అత్యంత ప్రతిభవంతులైన కళాకారుడిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. బాహుబలి సినిమాకు ఈయన అందించిన బ్యాక్ గ్రౌండ్ శబ్దాలే ప్రేక్షకులు సినిమా ఎంజాయ్ చేసేలా చేశాయని చెప్పాలి.