తునివు - వరిసు: ఆ రోజు నుంచి బుకింగ్ ఓపెన్ షురూ..!
మరొకవైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న బై లింగ్వల్ చిత్రం వారసుడు సినిమాని కూడా తమిళ్లో వారిసు పేరిట జనవరి 12వ తేదీన రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ రెండు సినిమాలతో పాటు బాలయ్య వీర సింహారెడ్డి , చిరంజీవి వాల్తేరు వీరయ్య చిత్రాలు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ నాలుగు చిత్రాలతో పోల్చుకుంటే విజయ్ నటిస్తున్న వారసుడు చిత్రానికే ఎక్కువగా థియేటర్ లు లభించినట్లు సమాచారం. ఇకపోతే ఈ రెండు సినిమాల విడుదలకు ఇంకా పదిరోజుల సమయం ఉంది.
అయితే ముందుగానే విజయ్ వారిసు, అజిత్ తునివు సినిమా బుకింగ్స్ త్వరలోనే మొదలు కాబోతున్నాయి అని స్పష్టం అవుతుంది. అసలు విషయంలోకి వెళితే ఇప్పుడు వచ్చే ఆదివారం నుంచి తమిళనాడులో ఈ రెండు సినిమాల ప్రీ బుకింగ్ ఓపెన్ కాబోతున్నాయి. రెండూ కూడా చాలా త్వరగా విడుదల చేయడం ద్వారా మంచి ప్రారంభాన్ని పొందాయి. TNలోని అన్ని నగరాల్లో ఆదివారం నుండి బుకింగ్‌లు తెరవబడతాయి అని చిత్ర బృందం స్పష్టం చేసింది.