కే జి ఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్గా గుర్తింపు పొందడు ప్రశాంత్ నీల్ ఈ సినిమా అనంతరం ప్రభాస్ తో సలార్ సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా జరుగుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి చాలా రోజులు కావస్తుంది. దీంతో ఈ సినిమాకి సంబంధించి చాలా ఆసక్తిగా ఉన్నారు డార్లింగ్ అభిమానులు. అయితే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది.
కానీ ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉన్నందుకు గాను కొద్దిగా ఆలస్యం అవుతుంది.
సలార్ సినిమా కొత్త షెడ్యూల్ ఈనెల 8 నుండి మొదలుపెట్టనున్నారు. అయితే ఈనెల 8 నుండి ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్ క్లైమాక్స్ కు చెందిన కొన్ని సన్నివేశాలను చాలా ఆసక్తికరంగా చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలోని కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలని భారీ ఎత్తున క్షత్రీకరించాలని ప్రశాంత్ నీల్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికిగాను చివరి షెడ్యూల్లో ఈ సన్నివేశాలని చిత్రీకరించాలని ప్లాన్ చేశాడట డైరెక్టర్. ఇక హోంబలే వారు ఈ సినిమా నిర్మాణాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది.
అయితే ప్రభాస్ నటిస్తున్న సలార్ సినిమా సెప్టెంబర్ లో విడుదల కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే మొదట అనుకున్నట్టుగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయి ఉంటే ఈ ఏడాది మొదట్లోనే ప్రభాస్ సినిమాను విడుదల చేయాలని భావించారు. అయినప్పటికీ కొన్ని కారణాలవల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా విడుదల చేయడం కాస్త ఆలస్యంగా మారింది.కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది..!!