టాలీవుడ్
ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్
మూవీ లలో హీరోగా నటించి
టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగడం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపును సంపాదించుకున్న
రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించదగ్గ గొప్ప దర్శకులను ఒకరు అయినటువంటి
శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న
మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.
దిల్ రాజు నిర్మిస్తున్న ఈ
మూవీ లో
కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ...
సునీల్ ...
అంజలి ఇతర ముఖ్య పాత్రలో కనిపించనుండగా ...
ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ
మూవీ తర్వాత
రామ్ చరణ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే
మూవీ లో హీరోగా నటించబోతున్నాడు . ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వచ్చేసింది.
ఇలా వరుస
మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్నా
రామ్ చరణ్ మరికొన్ని రోజుల్లో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని ఒక
ఎపిసోడ్ గెస్ట్ గా రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ
ఎపిసోడ్ కు
రామ్ చరణ్ తో పాటు
తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా బాధ్యతలను వ్యవహరిస్తున్న కల్వకుంట్ల తారక రామారావు కూడా రాబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు . ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆన్ స్టాపబుల్ సీజన్ 2
సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది .