ఆ లిస్ట్ లో చేరిన ఏకైక ఇండియన్ హీరోగా ఎన్టీఆర్..!?

Anilkumar
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయం అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో చాలామంది ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉంటుంది అని కచ్చితంగా ఈసారి రాజమౌళికి అవార్డు వస్తుందని అనేకమైన కథనాలు వచ్చాయి. అయితే తాజాగా దర్శక ధీరుడు రాజమౌళిని న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ బెస్ట్ డైరెక్టర్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీనికిగాను ఇవాళ ఆ అవార్డును కూడా అందుకున్నాడు రాజమౌళి. అయితే తాజాగా ఇప్పుడు వెరైటీ మ్యాగజిన్ అనే అంతర్జాతీయ సంస్థ

 ఆస్కార్ బరిలో ఉండగలిగే బెస్ట్ యాక్టర్ ల లిస్టును తయారు చేసింది. ఇందులో భాగంగానే ఉత్తమ నటుడి కేటగిరీలో జూనియర్ ఎన్టీఆర్ పేరు రావడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రేడిక్షన్ లిస్టులో పదిమంది ఉత్తమ అన్నట్టుల్లో ఉండడం తో ఈయన అభిమానులు తెగ సంతోషిస్తున్నారు. దీంతో చాలామంది ఎన్టీఆర్ కి ఈసారి ఆస్కార్ అవార్డు రావడం పక్కా అని అంటున్నారు.అయితే జూనియర్ ఎన్టీఆర్ కి అవార్డు వస్తుందా రాదా అన్నది తెలియదు కానీ జూనియర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన త్రిబుల్ ఆర్ సినిమా అంతర్జాతీయ ముద్ర వేసింది.

 ఇప్పటికే రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా అంగీకరించారు. దీంతోపాటు ఈ సినిమా గోల్డెన్ నామినేషన్స్ లో కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అయితే త్రిబుల్ ఆర్ సినిమా  కి అటు ఆస్కార్ మరియు గోల్డెన్ అవార్డులు వచ్చే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. త్రిబుల్ ఆర్ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో ఇప్పుడు సినీ ప్రేక్షకులు ఎంతో సంతోషిస్తున్నారు. దాదాపు 1200 కోట్లను కొల్లగొట్టిన ఈ సినిమా భారీ  అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా ఇంతటి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా సీక్వెల్ ని కూడా ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: