సినీ ఇండస్ట్రీలోకి మొదట మోడల్ గా అడుగుపెట్టి దాని అనంతరం కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది రేణు దేశాయ్.దాని అనంతరం పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బద్రి సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా చేసే సమయంలోనే పవన్ కళ్యాణ్ మరియు రేణు దేశాల మధ్య ప్రేమ చిగురించింది. దాని అనంతరం వారిద్దరి కాంబినేషన్లో జానీ సినిమా కూడా వచ్చింది. ఇక పెళ్లికి ముందే సహజీవనం చేసిన వీరిద్దరూ అకిరానందన్ కి జన్మనిచ్చారు. ఒక కొడుకుకి జన్మనిచ్చిన అనంతరం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.
ఆ తరువాత ఆధ్యా కి కూడా జన్మనిచ్చింది రేణు దేశాయ్. ఇద్దరు పిల్లలు పుట్టాక కొన్ని సంవత్సరాలు బానే ఉన్నప్పటికీ కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం ఇద్దరు పిల్లలు రేణు దేశాయ్ దగ్గరే ఉంటున్నారు. వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ ఆ పిల్లలకి మాత్రం తల్లిదండ్రులు గాని వ్యవహరిస్తున్నారు. వారిద్దరి పిల్లలు చేసే ఏ పనులలో అయినా భాగమవుతారు పవన్ దంపతులు. అంతేకాదు ఆ పిల్లలని దగ్గరుండి ప్రోత్సహిస్తారు. ప్రస్తుతం రేణు దేశాయ్ సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ బుల్లితెరపై ప్రసారమవుతున్న కొన్ని షోలలో కనిపిస్తోంది.
అయితే తాజాగా రవితేజ నటిస్తున్న ఒక సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది రేణు దేశాయ్. సినీ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గానే ఉంటుంది రేణు దేశాయ్. ఈ క్రమంలోని తన పిల్లలకి సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది. ఇక అసలు విషయం ఏంటంటే తాజాగా రేణు దేశాయ్ తన పిల్లల్ని తీసుకొని ఒక మంచు ట్రిప్ కి వెళ్ళింది.ఆ ట్రిప్ లో భాగంగా కొన్ని ఫోటోలను వీడియోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ పిల్లలతో కలిసి ఒక కారులో వెళుతుంది.కారు చుట్టూ మంచుతో కప్పబడి ఉంది. ఈ క్రమంలోనే ఆద్య కారులో నుండి నాకు మంచులోకి దూకేయాలని అనిపిస్తుంది అమ్మ అంటూ అంటుంది.దీంతో ఆధ్యా మాట్లాడిన మాటలు కాస్త సోషల్ మీడియా వేదికగా ఫైరల్ అవుతున్నాయి..!!