అన్ స్టాపబుల్-2 : పవన్ ఎపిసోడ్ వచ్చేది అప్పుడే..!?

Anilkumar
నట సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా  వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్  సీజన్ వన్ ఇప్పటికే మంచి విజయాన్ని అందుకుంది. దాంతో సీజన్ 2 ను కూడా ప్రారంభించారు ఆహా టీం. ఇక ఈ సీజన్ కూడా మంచి సక్సెస్ తో దూసుకుపోతుంది. అయితే రాబోయే ఎపిసోడ్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న సంగతి మనందరికీ తెలిసిందే.అయితే ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ఈ ఎపిసోడ్ కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 అయితే ఇందులో భాగంగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానున్న ఎపిసోడ్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనికి గాను తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ హ టీం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ని ఈనెల ఆఖరిలో గాని ఫిబ్రవరి మొదటి వీక్ లో గాని విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక బాలయ్య షోకి వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని బాలయ్య ఎలాంటి ప్రశ్నలు అడిగాడు అన్నది ఇప్పుడు అందరి లో ఆసక్తిగా మారింది. అయితే గతంలో వీరిద్దరూ కలిసి ఒకే స్టేజిపై ఎప్పుడు కనిపించలేదు.


 దీంతో మొదటిసారి బాలయ్య మరియు పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై కనిపించడంతో వీరి అభిమానులు ఈ షోని చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల ఈ షో కి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ వచ్చి ఎంతటి రికార్డును సృష్టించాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాబోయే ఎపిసోడ్ మరెన్ని రికార్డులను సృష్టిస్తుందో అంటూ వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పవన్ అభిమానులు ఈ నేపథ్యంలోనే బాలయ్య పవన్ కళ్యాణ్ ని రాజకీయాల గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతాడు అంటూ ఈ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మెగా మరియు నందమూరి అభిమానులు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: