ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ షోలో సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు సైతం వస్తున్నారు. అయితే మొదటి సీజన్లో సెలబ్రిటీలో మాత్రమే రావడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రసారమవుతున్న సీజన్ 2 లో సెలబ్రిటీలతో పాటు రాజకీయ నేతలు కూడా వస్తున్నారు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఇప్పుడు దేశంలోని నంబర్ వన్ షోగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఈ షో భారీ రివ్యూస్ తో దూసుకుపోతుంది.
సీజన్ వన్ మంచి విజయాన్ని అందుకోవడంతో రెండవ సీజన్ లో చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తున్నారు.తాజాగా ఈ షో కి పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రావడం జరిగింది. ఇక ప్రభాస్ వచ్చిన ఈ ఎపిసోడ్ ని రెండు పాటలుగా విడుదల చేయనున్నారు ఆహా టీం. ఇందులో భాగంగానే ప్రభాస్ వచ్చిన ఎపిసోడ్లో నందమూరి బాలకృష్ణ రామ్ చరణ్ కి ఫోన్ చేసి మాట్లాడడం కాస్త ఈ షో కి హైలైట్ గా నిలిచింది. ఈ క్రమంలోని రామ్ చరణ్ కూడా ఈ షో కి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆహ టీం రామ్ చరణ్ తో పాటు ఆ ఎపిసోడ్కి కేటీఆర్ ని కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఇక దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే ఆహా టీం విడుదల చేయనున్నట్లుగా సమాచారం. అయితే ఈ సంక్రాంతికి గాను జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. ఇది అయిపోయిన వెంటనే రామ్ చరణ్ మరియు కేటీఆర్ కి సంబంధించిన ఎపిసోడ్ ప్రారంభం కానట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇక గతంలో రామ్ చరణ్ నటించిన ఓ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకకు గాను కేటీఆర్ ముఖ్యఅతిథిగా వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. అంతే కాదు మెగా ఫ్యామిలీతో కేటీఆర్ కి మంచి అనుబంధం ఉంది. దీంతో రాంచరణ్ ఎపిసోడ్ కి కేటీఆర్ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..!!