మరోసారి పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ పై సెటైర్లు వేసిన బండ్ల గణేష్..!

Divya
ప్రముఖ హీరోగా.. నిర్మాతగా.. గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. చేతిలో మైకు ఉంటే చాలు విచక్షణారహితంగా మాట్లాడుతూ వైరల్ అవుతూ ఉంటాడు. అంతేకాదు తనకు సంబంధం లేని విషయాలలో కూడా తలదూరుస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచే బండ్ల గణేష్ చేసే ఏ విషయం అయినా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ నమ్మిన బంటుగా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ క్రమక్రమంగా పవన్ కళ్యాణ్ పై సెటైర్లు వేస్తూ ఆయనకు దూరమవుతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంతేకాదు పవన్ కళ్యాణ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించే రోజులలో పవన్ కళ్యాణ్ సన్నిహితుడు త్రివిక్రమ్ తో కూడా విభేదాలు ఉన్నాయని వార్తలు బాగా బలంగా వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా మరొకసారి పవన్ కళ్యాణ్ , త్రివిక్రమ్ మీద తన అసంతృప్తిని తెలియజేస్తూ ఇంటర్వ్యూలో బయటపెట్టేసారు బండ్ల గణేష్.. ముందుగా త్రివిక్రమ్ పేరు సంబోధించకుండా గురూజీ అని సంబోధిస్తూ.. బండ్ల విమర్శలు చేశాడు. నిజమైన పవన్ కళ్యాణ్ గారిని బయటకు తీసింది నేను.. ఆయనకు విపరీతమైన టాలెంట్ ఉంది అని చెప్పింది నేను. ఇప్పుడు చాలామంది గురూజీలు , బరూజీలు వచ్చారు తప్పితే అంటూనే నాకు తెలియదు.. ఇది వేరే విషయం అంటూ తెలిపాడు. నేను ఈరోజుకి కూడా హీరో గారంటే ఒక కృతజ్ఞత చూపిస్తున్నాను. కానీ వాళ్ళు నా పైన చూపించాల్సిన అవసరం లేదు అంటూ కూడా బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు.


ఇకపోతే ప్రొడక్షన్ ఆపేసిన బండ్ల గణేష్ కొద్ది రోజుల తర్వాత మళ్లీ ప్రొడక్షన్ కొనసాగించాలని పవన్ కళ్యాణ్ దగ్గరకు వెళ్లి సినిమా చేస్తానన్నాడట. కానీ బండ్ల గణేష్ కు కాల్ సీట్లు ఇచ్చే అంత ఖాళీ డేట్స్ తన దగ్గర లేవని పవన్ కళ్యాణ్ చెప్పారంట. అయితే తనతో ఇలా చెప్పించింది త్రివిక్రమే అని అనుమానం బండ్ల గణేష్ లో చాలా ఉన్నట్లు తెలుస్తోంది అందుకే ఇలా పరోక్షంగా టార్గెట్ చేసి కామెంట్లు చేస్తున్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: