అన్ని కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న సీతారామం హీరోయిన్..!?

Anilkumar
మొదట హిందీ సీరియల్స్ లో నటించి పాపులర్ అయిన మృణాల్ ఠాగూర్ ఇటీవల విడుదలైన సీతారామం సినిమాలో హీరోయిన్ గా నటించి ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ ఇమేజ్ ని దక్కించుకుంది.ఈమె నటించిన మొదటి సినిమా ఇదే అయినప్పటికీ మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. హనురాగపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ సినిమాలో మృణాల్ ఠాగూర్ ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే ఈమె హీరోయిన్గా నటించిన మొదటి సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నప్పటికీ రెండవ సినిమా కి సైన్ చేయడానికి చాలా గ్యాప్ తీసుకుంది ఈమె. అయితే దీనికి కారణం రెమ్యూనరేషన్ అని చాలామంది అభిప్రాయం పడుతున్నారు. 

తాజాగా ఈమె నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న నాని 30 సినిమాలో హీరోయిన్గా ఎంపికైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నాని నటిస్తున్న ఈ సినిమాలో ఈమె కి నిర్మాతలు  ఏకంగా కోటి రూపాయలకు పైగానే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా సమాచారం. అయితే ఈమె నటించిన మొదటి సినిమాకి గాను ఈమె 85 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంది. ఇక  ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నాని సినిమాలో నటించినందుకు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమా అనంతరం ఈమెకి ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నిర్మాతలు కూడా ఆమె డిమాండ్ చేసినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధపడ్డట్లు తెలుస్తోంది. 

ఈమె డిమాండ్ చేసిన రెమ్యునరేషన్ నిర్మాతలు ఇవ్వడంతో ఈ సినిమాకి మృణాల్ ఓకే చేసినట్లుగా తెలుస్తుంది. అయితే మరికొందరు మాత్రం నానితో ఈమె సినిమా చేయాలని.. అంతేకాదు నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమా కథ ఈమెకి కి బాగా నచ్చడంతోనే ఈ సినిమా చేయడానికి ఓకే చేసినట్లుగా అంటున్నారు. మరోవైపు రెమ్యూనరేషన్ కారణంగానే ఈ సినిమా చేయడానికి ఆమె ఒప్పుకుంది అని అంటున్నారు. ఏదేమైనా నేచురల్ స్టార్ నానితో ఈమె సినిమా చేస్తుంది అన్న వార్త విన్న వీరి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: