మైత్రి వేరు కుంపటి.. రిస్క్ కూడా ఉంది..!

shami
శ్రీమంతుడు సినిమాతో నిర్మాతలుగా మారి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ గా సత్తా చాటుతున్నారు మైత్రి మూవీ మేకర్స్. అంతకుముందు తమ బిజినెస్ లతో పాటుగా ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ నడిపించిన మైత్రి మేకర్స్ నిర్మాతలుగా మారాక డిస్ట్రిబ్యూషన్ వదిలేశారు. భారీ సినిమాలు చేస్తున్న వీరికి తెలుగు రెండు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూషన్ కి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దిల్ రాజు ఇక్కడ ఏక చక్రాధిపత్యం చేస్తున్నాడని చాలామంది ఫీల్ అవుతున్నాడు.

అందుకే నిర్మాతలుగా ఉన్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ కొత్తగా డిస్ట్రిబ్యూషన్ లోకి దిగారు. నైజాం ఏపీ రెండు రాష్ట్రాల్లో వీరు కూడా డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. కేవలం వీరి సినిమాల వరకు చేసుకున్నా సరే వీరు లాభ పడే ఛాన్స్ ఉంది. అయితే రీసెంట్ గా మైత్రి వారు డిస్ట్రిబ్యూషన్ చేయడంపై నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్స్ కష్టం ఏంటన్నది రెండేళ్ల తర్వాత వారికి అర్ధమవుతుందని అన్నాడు. అంటే మైత్రి వారితో తన విభేదాలు దాదాపు నిజం అన్నట్టే చెప్పుకొచ్చాడు దిల్ రాజు.

వరుసగా తమ ప్రొడక్షన్ లో సినిమాలు చేస్తున్న మైత్రి మేకర్స్ ఇలా డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి కూడా దిగడం మంచి తరుణమే అని చెప్పొచ్చు. అయితే డిస్ట్రిబ్యూషన్ లో తల పండిన దిల్ రాజుతో మైత్రి వారు పోటీ పడతారా లేదా అన్నది చూడాలి. వరుస స్టార్స్ తో సినిమాలు ఉండగా మైత్రి వారు చేస్తున్న ఈ డిస్ట్రిబ్యూషన్ వల్ల వారికి ఏమేరకు బిజినెస్ ప్రాఫిట్స్ వస్తాయో చూడాలి. మైత్రి వారి వేరు కుంపటి ఇండస్ట్రీలో సమీకరణాలు మార్చేలా చేస్తుందని చెప్పొచ్చు. మత్రి మూవీ మేకర్స్ ఈ సంక్రాంతికి రెండు తమ సినిమాలతో పోటీ పడుతున్నాయి. ఇక మీదట movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ రంగంలో కూడా దూసుకెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఏపీ, తెలంగాణాలో సొంతంగా డిస్ట్రిబ్యూషన్ ని స్టార్ట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: