మరో వివాదం లో రష్మీక మందన.. ఎందుకంత నోటిదూల అంటున్న నెటిజన్లు..!?

Anilkumar
ఇటీవల ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో బన్నీకి జోడిగా నటించింది రష్మిక మందన. ఈ సినిమాతో మరింత క్రేజ్ ను అందుకుంది ఈమె. అంతేకాదు ఈ సినిమాతోనే నేషనల్ క్రష్ అని పేరు కూడా దక్కించుకుంది. తన అందం అభినయంతో ఇంతటి గుర్తింపును తెచ్చుకున్న ఈమె ప్రస్తుతం వరుస వివాదాలలో చిక్కుకుంటుంది. అయితే ఈసారి ఈమె సౌత్ ఇండస్ట్రీని ఉద్దేశించి కొన్ని కామెంట్లను చేయడం జరిగింది. ఇక బాలీవుడ్ లో తను నటించిన మిషన్ మజ్ను సినిమా జనవరిలో ఓ టి టి లో రిలీజ్ అవుతుంది. 

ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంది రష్మిక. ఇందులో భాగంగానే రష్మిక మాట్లాడుతూ బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ తీయడంలో బెస్ట్ అని.. చిన్నప్పటి నుంచి వాటిని చూస్తూ నేను పెరిగాను అని.. అదే సౌత్ సినిమాల్లో అయితే అన్ని మాస్ మసాలా ఐటమ్ సాంగ్స్ అని.. డాన్స్ అసభ్యకరమైన స్టెప్పులు ప్రధానంగా ఉంటాయని చెప్పకు వచ్చింది రష్మిక మందన. దీంతో ఈ వార్త విన్న అనంతరం చాలా మంది నెటిజన్స్ మళ్ళీ రష్మిక మందన పై ఫైర్ అవుతున్నారు. సౌత్ ఇండస్ట్రీ ద్వారా ఇంతటి పాపులారిటీని అందుకున్న ఈమె బాలీవుడ్ లో నాలుగు సినిమాలు చేసి సౌత్ ఇండస్ట్రీని ఇంతలా అవమనిస్తుందా అంటూ తెగ ఫైర్ అవుతున్నారు.

 సౌత్ సినిమాల నుండి ఇప్పుడు నీకు ఇంతటి ఫాన్ ఫాలోయింగ్ వచ్చింది.. నువ్వు నాలుగు సినిమాలలో నటించిన బాలీవుడ్ ద్వారా నీకు ఎంతటి పేరు వచ్చిందని ప్రశ్నిస్తున్నారు చాలామంది నటిజెన్లు. ఇదిలా ఉంటే ఇటీవల కన్నడ నుంచే కాదు ఈమెని మొత్తం సౌత్ నుంచి బహిష్కరించాలి అన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి.  కాంతార  రిషబ్ శెట్టి దర్శకత్వంలో పెరకెక్కిన కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఈమె పరిచయమైంది. దాని అనంతరం ఆ సినిమా హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం కూడా జరుపుకుంది ఈమె.  మంచి గుర్తింపు రావడంతో ఆ పెళ్లిని సైతం క్యాన్సల్ చేసుకుంది రష్మిక.ఇటీవల కాంతార సినిమా గురించి ఈమె చేసిన కామెంట్స్ ద్వారా కూడా మరో వివాదంలో చిక్కుకుంది ఈమె.. దీని అనంతరం ఆమెపై కన్నడ పరిశ్రమ నుండి తీవ్ర అభ్యంతరాలు కూడా రావడం జరిగింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: