గత కొన్ని ఏళ్లు గా బుల్లితెరపై యాంకర్ గా అనేక షోలను చేస్తూ టాప్ యాంకర్ గా గుర్తింపు పొందింది సుమ. అయితే గత కొన్ని రోజులుగా సుమకి సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఒక ఈవెంట్ లో భాగంగా ఈమె మాట్లాడుతూ వీటన్నిటికీ కాస్త బ్రేక్ కావాలి అంటూ చెప్పుకొచ్చింది. దీనికిగాను చాలామంది నెటిజన్లు సుమ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పనుంది అని వీటన్నిటికీ దూరంగా ఫ్యామిలీతో ఉండాలని అభిప్రాయపడుతున్నట్లుగా కామెంట్లు చేస్తున్నారు. దీంతో చాలామంది సుమ
అభిమానులు ఎప్పుడూ గలగల మాట్లాడుతూ ఉండే సుమ యాంకరింగ్ కు ఎందుకు సడన్గా గుడ్ బై చెప్పనుంది అని... యాంకరింగ్ ఆపేస్తే ఎలా అని తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఇక ఎన్నో ఈవెంట్లలో మరియు షోలలో యాంకరింగ్ చేసిన ఈమె ఏలాంటి సిచువేషన్ లో అయినా తన మాటలతో ఆ షో రేంజ్ ని పెంచేస్తుంది. ఇదిలా ఉంటే ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సుమా భర్త రాజీవ్ కనకాల ఆరోగ్యం బాగాలేదని ఆ కారణంగానే సుమ ఇలాంటి డెసిషన్ను తీసుకుంది అని సోషల్ మీడియా వేదికగా అనేక రకమైన వార్తలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ వార్త విన్న అనంతరం చాలా మంది సుమ అంతా ఆ షో యొక్క టిఆర్పి బాగా రావాలని ఇదంతా ప్లాన్ చేసి చేసినట్లుగా కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు దీనికిగాను డిసెంబర్ 31 న బ్రేక్ తీసుకొని మళ్ళీ జనవరి 1న మళ్లీ తెరపై సుమ కంటిన్యూ అవుతుందని ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చాలామంది తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఇక దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇందులో నిజం ఎంతుందో తెలియాలి అంటే ఈ షో చూడాల్సిందే మరి..!!