ఈ స్థాయి లో శ్రీలీల డిమాండ్ చేయడం కరెక్టేనా....??

murali krishna
ప్రెసెంట్ తెలుగు ఇండస్ట్రీ లో కొత్తగా వచ్చిన యాక్ట్రెస్ లా హవా నడుస్తుంది. వారు చేసిన సినిమాలుగనక విజయం సాధిస్తే వారికీ వరుస ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. అటువంటి వారిలో ప్రెసెంట్ చెప్పుకొదగ్గ హీరోయిన్ శ్రీలీల ఒకరు.
తాను ఇండస్ట్రీ లో పెళ్లిసందడి మూవీ తో ఏంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకుంది. అలాగే లేటెస్ట్ గా రిలీజ్ ఐనా ధమాకా మూవీ తో ఇంకొక బ్లాక్ బస్టర్ హిట్ను తన అకౌంట్ లో వేసుకుంది అన్న విషయం అందరికి తెల్సిందే.l
ఐతే తాను చేసిన రెండు మూవీస్ కూడా హిట్ అవ్వడంతో ఆమె అదృష్టం మారిపోయింది.ప్రెసెంట్ మహేష్బాబు -త్రివిక్రమ్ కాంబోలో వస్తున్నా సినిమా , అలాగే బాలయ్య -అనిల్ కాంబోలో వస్తున్నా సినిమా కూడా మంచి విజయం సాధిస్తే ఇంకా ఆమె రష్మికను దాటేసి తెలుగుఇండస్ట్రీలో ఒక స్టార్ డం ను కైవసం చేసుకొని టాప్ హీరోయిన్ గా నిలిచే ఛాన్సెస్ ఉన్నాయి.
ఇదిలా ఉంటే తాను చేయబోతున్న బాలయ్య అనిల్ కాంబో సినిమా కి ఒక కోటి రూపాయలు అమౌంట్ అడిగిందని ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నాయి. ఐతే ఇదిలావుంటే ఇపుడు మాత్రం తన డిమాండ్ ను డబల్ చేసిందని టాక్.
ఐతే అప్పటికే పచ్చ జండా ఊపిన సినిమాలకు కాకపోయినా తర్వాత ప్రాజెక్ట్స్ కు రెండు కోట్లు అడగడానికి సిద్ధం యిందని తెలుస్తుంది.ఐతే రెమ్యునరేషన్ పరంగా శ్రీలీల కరెక్ట్ వే లో వెళ్తున్నారని కొంతమంది అనగా మరికొంతమంది మాత్రం ఆమె రాంగ్ వే లో పోతుందని చెప్పుకోస్తున్నారు.
ఐతే ఇ విధంగా రెమ్యునరేషన్ ను భారీస్థాయి లో పెంచడం వల్ల ఒకవేళ ఏదైనా మూవీ ప్లాప్ ఐతే అపుడు ఆమెకు ఛాన్సెస్ రావడానికి చాలా తక్కువ స్కోప్ ఉండిద్దని తెలుస్ తుంది.ఐతే ఆమెకు ఇంకా మంచి గుర్తింపు వచ్చే దాక రాంగ్ రూట్ వేయవద్దని ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేస్తున్న వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.ఐతే వీటిని అర్ధం చేసుకొని తన కేరిర్ పరంగా శ్రీలీల ఆలోచిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: