బిగ్ బాస్ హోస్ట్ గా బాలయ్య.. రెమ్యూనరేషన్ తో టెంప్ట్ చేశారట?
అయితే ఇక ఇప్పుడు మరో పవర్ఫుల్ హీరోతో బిగ్ బాస్ హోస్టింగ్ చేయించాలని ఇక ఆ షో నిర్వాహకులు భావిస్తున్నారు అన్నది తెలుస్తుంది. ఆ పవర్ ఫుల్ హీరో ఎవరు కాదు ప్రస్తుతం అన్ స్టాపబుల్ షో తో ఎక్కడ వెనక్కి తిరిగి చూడకుండా దూసుకుపోతున్న నందమూరి హీరో బాలకృష్ణ. ఇప్పటికే అన్ స్టాపబుల్ మొదటి సీజన్ సూపర్ హిట్ కావడంతో ఇటీవల రెండవ సీజన్ కూడా ప్రారంభమై భారీ రేటింగ్ సొంతం చేసుకుంటుంది.
ఇక బాలకృష్ణను హోస్టుగా తీసుకొస్తే బిగ్ బాస్ మరింత రంజుగా మారుతుందని నిర్వాహకులు భావిస్తూ ఉన్నారట. ఇక వచ్చే సీజన్ 2023 జూన్ లో మొదలు పెట్టాలని ఆలోచనలో ఉన్నారట నిర్వాహకులు. ఇప్పటికే యువ హీరో అయిన రానా పేరు కూడా కొన్నిసార్లు వినిపించింది. కానీ ప్రస్తుతం హడావిడి చూస్తుంటే మాత్రం బాలకృష్ణ ఫిక్స్ అయిపోయాడు అని తెలుస్తుంది. అయితే బాలకృష్ణ ఇక ఇప్పుడు బిగ్ బాస్ చేయడానికి సిద్ధంగా లేకపోయినప్పటికీ.. ఏకంగా రెమ్యూనరేషన్ తో బాలకృష్ణను టెంమ్ట్ చేస్తున్నారట నిర్వాహకులు. అన్ స్టాపబుల్ షోలో 10 ఎపిసోడ్స్ కోసమే భారీ పారితోషకం అందుకున్నాడు బాలకృష్ణ. ఇక 100 రోజుల పైగా సాగే బిగ్ బాస్ షో అంటే ఇక ఏ రేంజ్ లో పారితోషికం డిమాండ్ చేస్తాడో అన్నది హార్ట్ టాపిక్ గా మారిపోయింది. బిగ్బాస్ నిర్వాహకులు మాత్రం బాలకృష్ణ ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట. ఏం జరుగుతుందో చూడాలి మరి.