టాలీవుడ్ లో
రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న
నాగచైతన్య మరియు
సమంత కొంతకాలం క్రితం విడాకులు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికీ వాళ్ళు ఎందుకు విడిపోయారు అన్న విషయం మాత్రం అంతుచిక్కని ప్రశ్న గానే ఉంటుంది. అయితే చాలామంది ఇప్పటికీ కూడా వీళ్ళిద్దరూ మల్లి కలిసిపోతే బాగుంటుందని కోరుకుంటున్నారు. విడాకుల అనంతరం
సమంత నాగచైతన్య మీద ఎప్పుడూ ఏవో ఒక కామెంట్స్ చేస్తూనే వార్తల్లో నిలుస్తోంది.దీంతో సినిమాలలో కూడా వీరిద్దరూ కలిసి నటించరు అని ఫిక్స్ అయిపోయారు వీరి అభిమానులు.
అయితే తాజాగా
సమంత నటించిన యశోద
సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఆ సమయంలో
సమంత ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్లలో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇక అప్పుడు
సమంత మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ ప్రమోషన్ లో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా సమంత...జీవితంలో మనకంటూ గోల్స్ ఉండాలి.. వాటిని సాధించే క్రమంలో చాలా ఇబ్బందులు వస్తాయి...అలాంటి సమయంలో కొన్నింటిని కోల్పోవాల్సి కూడా వస్తుంది...మనం మన కోసం ముందు బ్రతకాలి తరువాత ఒకరికి సుఖం పంచడం కోసం ఆలోచించాలి..
కానీ నా విషయానికొస్తే మాత్రం ఒకరికి సుఖం పంచడం కోసం అయితే పుట్టలేదు అంటూ చెప్పుకొచ్చింది సమంత.దింతో పరోక్షంగా ఆమె విడాకులకు సంబంధించి మాట్లాడింది అంటూ ఈ వార్త విన్న చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇదిలావుంటే
సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ వ్యాధితో బాధపడుతుంది. దీనికోసం గత కొన్ని రోజుల నుండి ఆమె ఆ వ్యాధి కి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా తీసుకుంటుంది....ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ ఎలాంటి మార్పు లేకపోవడంతో సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈమె
విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తున్న
ఖుషి సినిమాతో పాటు
గుణశేఖర్ తెరకెక్కిస్తున్న శాకుంతలం
సినిమా షూటింగ్లో పాల్గొనాల్సి ఉంది.ఈ రెండు సినిమాలు పూర్తయిన అనంతరం మరికొన్ని సినిమాల్లో కూడా
సమంత పాల్గొనాల్సి ఉంటుంది. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!