మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్
సినిమా సక్సెస్ అనంతరం ఇప్పుడు
శంకర్ దర్శకత్వంలో వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే.రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని స్టార్
ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఆర్ ఆర్ ఆర్
సినిమా తర్వాత
రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సి15 సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అభిమానుల కోరుకుంటున్నట్లు గా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్.
ఇక ఇటీవల ఈ సినిమాకి సంబంధించి లీకైన ఫోటోలు వీడియోలు ఇటీవల కాలంలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో రాంచరణ్ ఎన్నడూ లేనివిదంగా రెండు విభిన్న పాత్రలో కనిపించనున్నాడట.అందులో భాగంగానే ఈ సినిమాలో చరణ్ ఒకటి 50 ఏళ్ల వయసున్న
తండ్రి పాత్రలో మరొకటి కొడుకు పాత్రలో కనిపించనున్నట్లుగా సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఈ రెండు పాత్రలతో పాటు ఇంకొక పాత్ర కూడా ఉందట.ఆ పాత్రలో
రామ్ చరణ్ విలన్ గా కనిపిస్తాడు అన్న వార్తలు సైతం సోషల్
మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.రామ్ చరణ్ నటిస్తున్న తండ్రి వయసున్న పాత్రకు నత్తి ఉండడంతో పాటు
శంకర్ ఎంతో ప్రత్యేకంగా ఈ పాత్రను చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ
సినిమా ఆ పాత్ర పూర్తి సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది అని తెలుస్తుంది. ఇక ఈ వార్త తెలిసిన అనంతరం
రామ్ చరణ్ నత్తి పాత్రలో ఎలా నటిస్తారో అని ఆయన అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు.ఇక గతంలో
సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో చరణ్ చెవిటి వాడిగా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో ప్రయోగం చేసి నత్తి క్యారెక్టర్ లో ప్రేక్షకులను ఎలా అలరిస్తాడో అన్నది చూడాలి. దీంతో ఈ వార్త తెలిసిన
రామ్ చరణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ
సినిమా కోసం ఎదురుచూస్తున్నారు..!!