భారీ బడ్జెట్ తో పాన్
ఇండియా మూవీ గా తెరకెక్కిన ఈ
మూవీ ని ప్రముఖ
నిర్మాత డి
వి వి దానయ్య డి
వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించగా , ఎం ఎం
కీరవాణి ఈ
మూవీ కి సంగీతం అందించాడు.
అజయ్ దేవ్ గన్ , శ్రేయ సముద్ర ఖని ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.
భారీ అంచనాల నడుమ తెలుగు ,
తమిళ ,
కన్నడ ,
హిందీ , మలయాళ భాషల్లో విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్
మూవీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విజయాన్ని అందుకుంది. అలాగే ఈ
మూవీ విజయంలో ఎం ఎం
కీరవాణి అందించిన సంగీతం కూడా అత్యంత కీలకపాత్రను పోషించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక అద్భుతమైన బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఆర్ ఆర్ ఆర్
మూవీ కి
ఆస్కార్ అవార్డ్ క్యాటగిరి లో చోటు దక్కాలి అని ఎంతో మంది సినీ ప్రేమికులు కోరుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే తాజాగా
ఆస్కార్ షాట్ లిస్ట్ లో ఎం ఎం
కీరవాణి సంగీతం అందించినటువంటి "నాటు నాటు" సాంగ్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది. ఇది ఇలా ఉంటే ఆర్ ఆర్ ఆర్
మూవీ మరికొన్ని కేటగిరీ లలో కూడా నామినేట్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.