మరో వివాదం లో నయనతార.. నిజమైన స్వామిజీ మాటలు..!?

Anilkumar
నయనతార మరియు విగ్నేష్ శివన్ లు ప్రేమించుకుని ఈ ఏడాది పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇక సినిమా సెలబ్రిటీలపై జ్యోతిష్యం చెప్పే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నయనతారకు పెళ్లి బంధం అచ్చి రాదని పెళ్లి చేసుకున్న అనంతరం ఎన్నో ఇబ్బందులు వస్తాయని చివరికి విడాకుల వరకు వెళుతుందని చెప్పిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఆయన చెప్పిన వ్యాఖ్యలపై చాలామంది విమర్శించినప్పటికీ కొంతమంది మాత్రం నిజమే అని నమ్మారు. ఇక ప్రస్తుతం ఆమెకి అదే పరిస్థితి ఎదురయ్యిందని ఆ జ్యోతిష్యుడు చెప్పిన మాటలే నిజం కావచ్చు అని అనుకుంటున్నారు.

ఎందుకు అంటే నయనతార పెళ్లి అయ్యాక తిరుపతిలో జరిగిన వివాదం అంతేకాదు కవల పిల్లల విషయంలో జరిగిన వివాదాలు ఇలా ఒకదాని వెంట మరొకటి తలెత్తుతూనే ఉన్నాయి. తాజాగా నయనతార ప్రధాన పాత్రలో రాబోతున్న కనెక్ట్ సినిమా కూడా చిక్కుల్లో ఉంది అనే వార్తలు వస్తున్నాయి. ఇక నయనతార విగ్నేష్ శివన్ లు  కలిసి నిర్మించిన మూవీ కనెక్ట్. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయి డిసెంబర్ 22న భారీ అంచనాల నడుమ విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.అయితే తాజాగా థియేటర్స్ ఓనర్లు నయనతార కు పెద్ద షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.

 కనెక్ట్ సినిమాని మధ్యలో ఎలాంటి ఇంటర్వెల్ సీన్ లేకుండా 99 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా ప్రసారం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ విషయంలో థియేటర్ ఓనర్స్ సినిమాని బ్రేక్ లేకుండా ప్రసారం చేయమని డైరెక్ట్ గా మూవీ యూనిట్ కి చెప్పడం జరిగిందట .అయితే ఈ సినిమాకి మధ్యలో బ్రేక్ లేకపోతే ఫుడ్ కోర్ట్ వల్ల వచ్చే ఇన్కమ్ కోల్పోతామని కచ్చితంగా ఇంటర్వెల్ సీన్ ఉంటుంది అని చెప్పారట. ఇక ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న నయనతార అనుమానులు పెళ్లయినప్పటి నుండి నయనతార కి ఏదో ఒక వివాదాలు తలెత్తుతూనే ఉన్నాయని.. తాజాగా మళ్లీ కనెక్ట్ సినిమా ఇష్యులో ఇరుక్కుందని ఈ విషయంలో వేణు స్వామి చెప్పిన మాటలే నిజమవుతున్నాయి అని ఆమె అభిమానులు ఆలోచనలో పడ్డారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: