బ్లాక్ బస్టర్ 'పుష్ప' సినిమా.. అక్కడ మాత్రం ఫ్లాపే.. నష్టాలు తప్పలేదుగా?
కేవలం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడం.. భారీగా వసూళ్లు రాబట్టడమే కాదు ఏకంగా జనాల్లో సృష్టించిన ఇంపాక్ట్ కూడా మామూలుది కాదు అని చెప్పాలి. ఏకంగా ఈ సినిమాలోని అల్లు అర్జున్ మేనరిజంతో చెప్పే తగ్గేదేలే డైలాగ్ అయితే అందరికీ అలవాటుగా మారిపోయింది అని చెప్పాలి. క్రికెటర్స్ రాజకీయ నాయకులు సామాన్య ప్రజలు ఇలా అందరూ కూడా పుష్ప సినిమాలోని ఎన్నో డైలాగులను వాడటం మొదలుపెట్టారు. అయితే కొన్ని రోజుల క్రితమే మాస్కోలో నిర్వహించిన అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో కూడా పుష్ప సినిమా ప్రదర్శించారు.
ఈ క్రమంలోనే మూవీ టీం ఒక సరి కొత్త ఆలోచన చేసింది. రష్యాలో కూడా ఈ సినిమాని ఘనంగా విడుదల చేయాలని భావించింది. ఈ క్రమంలోనే అక్కడ భారీగా ప్రమోషన్స్ కూడా నిర్వహించింది. ఇక కొన్నాళ్లపాటు రష్యాలోనే మాకం వేశారు హీరో, హీరోయిన్ సహా చిత్ర బృందం కూడా ఇక భారత్లో లాగానే రష్యాలో కూడా ఈ సినిమా అదరగొడుతుంది అని అనుకున్నారు. ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించడంతో ఇక ఇలాంటి అంచనాకు పోయారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ కోసం ఏకంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. అయితే ఈ సినిమా విడుదలైన తర్వాత మాత్రం ఊహించని రెస్పాన్స్ వచ్చింది. విడుదలై వారం రోజులు దాటిన కనీసం 8 లక్షల కూడా వసూలు చేయలేకపోయింది పుష్ప. దీంతో ఇక నిర్మాతలకు నష్టాలే మిగిలాయి.