సుధీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన అనసూయ..!?

Anilkumar
బుల్లితెర యాంకర్ గా నటిగా మంచి పేరు సంపాదించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈమె జబర్దస్త్ మానేసిన సంగతి మనందరికీ తెలిసిందే. నటిగా ఈమెకి మంచి ఆఫర్లు రావడంతో అనసూయ జబర్దస్త్ మరియు బుల్లితెర షోలకి యాంకరింగ్ చేయడం మానేసింది. ఈ తరుణంలో ఒక ఈవెంట్ లో పాల్గొన్న జబర్దస్త్ అనసూయని రిపోర్టర్ కొన్ని ప్రశ్నలను అడగడం జరిగింది. ఇక అందులో భాగంగా ఆమెని మీరు యాంకర్ గా సుధీర్ తో పనిచేశారు కదా ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని అడిగాడు.


దీనికి ఆమె సుధీర్ తో పనిచేసిన అనుభవం గురించి మాట్లాడుతూ... సుధీర్ నాకంటే జూనియర్ ఆ విషయం మర్చిపోయారా... నాతో పని చేసిన అనుభవం ఎలా ఉందో సుధీర్ ని  అడిగి తెలుసుకోండి అని ఆమె చెప్పింది. ఈ సమాధానం విన్న రిపోర్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అనంతరం సుధీర్ హర్ట్ అవుతాడనో... మరి ఇంకేమైనా ఆలోచించిందో కానీ సుదీర్ హార్డ్ వర్కింగ్.. టాలెంటెడ్ అంటూ కొంచెం ఎక్కువగానే మాట్లాడింది. అసలు రిపోర్టర్ అడిగిన ప్రశ్నకి సుధీర్ జూనియర్ అని గుర్తు చేయాల్సిన పనిలేదు.కానీ అక్కడ ఎవరు జూనియర్ ఎవరు సీనియర్ అని ప్రస్తావన రాలేదు.


అయినప్పటికీ అనసూయ చెప్పడంతో ఈ వార్త కాస్త వైరల్ గా మారింది. దీంతో  ఈ వార్త విన్నవారందరూ అనసూయ ఆ సందర్భంలో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది.. ఆ మాటకు వస్తే సుడిగాలి సుదీర్ ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో ఆమెకి తెలియదు అనుకుంటా... సుదీర్ తో పోల్చుకుంటే ఆమె చాలా తక్కువ.. ఆమె హీరోయిన్గా పలు సినిమాలు చేసినప్పటికీ ఒక్క హిట్టు కూడా అందుకోలేకపోయింది. సుడిగాలి సుధీర్ నటించిన గాలోడు సినిమాతో ఇటీవల హిట్ కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి మంచి లాభాలు కూడా వచ్చాయి. ఇక అలాంటి సుధీర్ ని పరోక్షంగా అనసూయ ఇన్సల్ట్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: