ఇప్పుడు సమంత మరియు విజయ్ దేవరకొండ కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా తో ఎవరి వల్ల ఎవరికి నష్టం కలుగుతుంది అనేది ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోని హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనికి కారణం ఏంటి అంటే వీరిద్దరూ కలిసి నటిస్తున్న రొమాంటిక్ సినిమా ఖుషి.సమంత నటించిన మజిలీ, ఓ బేబీ, సినిమాలో సూపర్ హిట్ అయిన అనంతరం మళ్లీ ఇప్పటివరకు అలాంటి హిట్ దొరకలేదు. ఆ సినిమాల తరువాత బాలీవుడ్ లో ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటించిన అనంతరం మంచి క్రేజ్ ను దక్కించుకుంది సమంత.
అయితే దాని తర్వాత విడుదలైన ఈమె సినిమాలన్నీ డిజాస్టర్లుగా నిలిచాయి. సమంత నటించిన యశోద సినిమా ఇటీవల మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.దీంతో ఆమె నమ్మకం ఇంకాస్త పెరిగింది. ఇక ఈ సినిమాలో సమంత నటనకు మంచి మార్కులే పడ్డాయి. ప్రస్తుతం సమంత నటించిన శాకుంతలం సినిమా పరిస్థితి ఏంటి అనేది ఎవరు ఊహించలేకపోతున్నారు. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ విషయాన్నికొస్తే గత కొన్ని ఏళ్లు గా ప్లాప్ లను మూట కట్టుకుంటున్న ఈయన ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా కూడా ఊహించిన విధంగా డిజాస్టర్ ను కనబరిచింది.
అయితే పూరి జగన్నాథ్ మరియు విజయ్ దేవరకొండ భారీ అంచనాలతో విడుదల చేసిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ మరియు పూరీ జగన్నాథ్ పరువు మొత్తం పోయింది అని వారి అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ మరియు సమంత ఎలాగైనా హిట్ కొట్టాలని వారిద్దరూ కలిసి నటిస్తున్న ఖుషి సినిమా ఎలాగైనా హిట్ కావాలని భావిస్తున్నారు. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి సంబంధించిన ఒక పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. కాదేంటంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పుడు రీ షూట్ చేస్తున్నారట. అయితే ప్రస్తుతం వీరిద్దరి టైం కూడా ఏం బాగాలేదని... ఈ సినిమాతో ఎవరి వల్ల ఎవరికి ప్లేస్ అవుతుంది లేదా మైనస్ అవుతుందా అని ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు తెలియదు. దీంతో వీరి అభిమానులు అయోమయంలో పడ్డారు..!!