చీర కట్టులో ముస్తాబైన పూజా హెగ్డే..!!

Divya
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో పూజా హెగ్డే కూడా ఒకరు. ఈమధ్య వరుస సినిమాలు ఫ్లాప్ కావడంతో బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమయింది. అక్కడ పలు సినిమాలలో నటిచ్చిన పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది. బాలీవుడ్లో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోహిత్ శెట్టి దర్శకత్వంలో వస్తున్న సర్కస్ సినిమా ఈనెల 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇందులో రన్వీర్ సింగ్, పూజా హెగ్డే జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ శర్మ ప్రధాన పాత్రల నటిస్తూ ఉన్నారు.
ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతూ ఉండడంతో చిత్ర బృందం సినిమా ప్రమోషన్స్ చాలా జోరుగా నిర్వహిస్తోంది. అలాగే పూజ హెగ్డే సర్కస్ సినిమా ప్రమోషన్లలో చాలా చురుకుగా పాల్గొంటుంది. అందుకు సంబంధించిన ఇంటర్వ్యులు ఇవ్వడమే కాకుండా ప్రమోషన్స్ ఈవెంట్ కు కూడా హాజరవుతూ ఉంటోంది. పూజ హెగ్డే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలను సైతం షేర్ చేయడం జరిగింది. ఈ ఫోటోలు చూసిన నేటిజెన్ల సైతం అదిరిపోయి అవుట్ ఫిట్ అందంతో పూజా హెగ్డే అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా చీరకట్టులో పూజ హెగ్డే షేర్ చేసిన ఫోటోలు చాలా ట్రెండీగా మారుతున్నాయి. బ్లూ స్లీవ్ ప్లేస్ బ్లౌజ్ సిల్క్ సారీలో తన పరువాలను ప్రదర్శించి కుర్రాళ్లకు మతులు పోగొట్టేలా చేస్తోంది పూజా హెగ్డే. ముఖ్యంగా చూపులతో యువతను కట్టిపడేసేలా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో, త్రివిక్రమ్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటించబోతోంది ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ త్వరలోనే రెండవ షెడ్యూల్ మొదలు కాబోతోంది. మరి వచ్చే ఏడాదైనా పూజా హెగ్డే కు అదృష్టం కలిసి వస్తుంది ఏమో చూడాలి మరి. ప్రస్తుతం ఈ ఫోటోలు మాత్రం వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: