అవతార్2: షాకిస్తున్న నెగటివ్ టాక్.. కష్టమే?

Purushottham Vinay
ఇక మరికొన్ని గంటల్లో అవతార్2 మూవీ థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని పలు థియేటర్లలో అవతార్2 సినిమాకి టికెట్లు దొరకడం సాధ్యం కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.చాలా భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుండగా అవతార్2 ఇంగ్లీష్ వెర్షన్ కు కూడా హైదరాబాద్ లోని థియేటర్లలో బుకింగ్స్ బాగున్నాయి. ఈ సినిమా టాక్ కోసం అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అవతార్2 సినిమా ఇండియన్ సినిమాల కలెక్షన్ల విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అభిమానులు భావిస్తున్నారు.పలువురు థియేటర్ల యజమానులు కేవలం ఈ సినిమా కోసం మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వారి స్క్రీన్లను మార్చడంతో పాటు సౌండ్ సిస్టమ్స్ విషయంలో కూడా చాలా మార్పులు చేశారు. తాజాగా ముంబైలో సెలబ్రిటీల కోసం అవతార్2 సినిమా స్పెషల్ షో స్క్రీనింగ్ జరగడం గమనార్హం. ఈ షో చూసిన సెలబ్రిటీల నుంచి సినిమాకు సంబంధించి అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అవతార్1 సినిమా స్థాయిలో అవతార్2 మెప్పించడం చాలా కష్టమని కామెంట్లు వినిపిస్తున్నాయి.


నెగిటివ్ రివ్యూలు ఇంకా నెగిటివ్ కామెంట్లు వస్తున్న నేపథ్యంలో సాధారణ ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వస్తే సమస్య లేదు.కానీ ఒకవేళ యావరేజ్ టాక్ వస్తే మాత్రం ఇబ్బందేనని చెప్పవచ్చు. ఈ భారీ అంచనాలే నెగిటివ్ రివ్యూలకు కారణమని కొంతమంది భావిస్తున్నారు. 50,000కు పైగా స్క్రీన్లలో రిలీజవుతున్న ఈ సినిమాకు చాలా పెద్ద భారీ టార్గెట్ ఉంది. అవతార్2 సినిమా బ్రేక్ ఈవెన్ అయితే మాత్రం మరిన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాల దిశగా అడుగులు పడే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ సినిమా ఫలితం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అలాగే ఈ సినిమా టికెట్ రేట్లు కూడా ఎక్కువగానే ఉన్నాయి. గ్రాఫిక్స్ ప్రధానంగా తెరకెక్కిన అవతార్2 సినిమా ఇక ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాల్సి ఉంది. అవతార్2 సినిమా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టించాలని సినీ అభిమానులు అందరూ కూడా కోరుకుంటున్నారు. ఏ సెంటర్లలో ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయనే విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: