ప్రిన్సెస్ గెటప్ లో జాహ్నవి కపూర్ మాములుగా లేదుగా..!!

murali krishna
అతిలోక సుందరి  కూతురూ జాన్వీ కపూర్‌ ఎప్పటికప్పుడు తన ఫోటో షూట్‌లతో ప్రేక్షకులను అందరినీ ఆకట్టుకుంటుంది. గ్యాప్‌ లేకుండా తన అందాల దాడికి దిగుతూ నెటిజన్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటుంది ఈ నటి

తాజాగా మరో కొత్త లుక్‌లో  ఇలా మెరిసింది.

జాన్వీ కపూర్‌ రాజకుమారిలా మారిపోయింది మరీ. రాయల్‌ లుక్‌లో ముస్తాబై రాజహంసలా కనిపిస్తుంది. భారీ డిజైనింగ్‌ వేర్‌లో జాన్వీ అందాల మరింత రెట్టింపయ్యాయి అని చెప్పొచ్చు. తాజాగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లని మంత్రముగ్దుల్ని చేస్తున్నాయి.

జాన్వీ హాట్‌ అందాలకు కేరాఫ్‌. అయితే దాన్నుంచి కాస్త రిలీఫ్‌ ఇచ్చిందీ క్రేజీ బ్యూటీ. రాజకుమారి లుక్‌లో ముగ్దమనోహరం, మరింత అందంగా కనిపించి కనువిందు చేస్తుంది ఈ బ్యూటీ. చూడ్డానికి రెండు కళ్లు చాలవు అనేట్టుగా ఆమె హోయలు పోయింది. ఈ సందర్భంగా ఆమె దిగిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఓ మేగజీన్‌ కోసం జాన్వీ కపూర్‌ ఇలా అందంగా, రాజహంసలా ముస్తాబైంది అని మనకు తెలుస్తూంది. రాకుమారిలా ఆమె మెరిసిపోయింది. ప్రస్తుతం నెట్టింట రచ్చ రచ్చ చేస్తుంది. ఈ సందర్భంగా ఓ పోస్ట్ పెట్టింది జాన్వీ. తనకు పీరియడ్‌ ఫిల్మ్ లో కనిపించాలని ఉందట. అప్పటి వరకు ఇలా పీరియడ్‌ లుక్‌లో ఫోటో షూట్లు చేయాల్సి ఉంటుందని పేర్కొంది.

తన పాత కాలపు రాచరికపు కలలను ఒక రోజు గడపడానికి నన్ను అనుమతించినందుకు లైఫ్‌ స్టయిల్‌ ఏషియా ఇండియాకి ధన్యవాదాలు కూడా తెలిపింది జాన్వీ. ఈ మేగజీన్‌ కోసమే ఇలా రాయల్‌ లుక్ లోకి మారిపోయింది జాన్వీ.

మరోవైపు ప్రస్తుతం జాన్వీ.. నటుడు వరుణ్‌ ధావన్‌తో కలిసి `బవాల్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులోనూ ఒక కొంత రాయల్ లుక్‌ పార్ట్ ఉంటుందని  మనకు టాక్‌. వీరిద్దరి కాంబినేషన్‌లోనూ ఓ వీడియో వైరల్‌ అవుతుంది.

జాన్వీ కపూర్‌ సోషల్‌ మీడియాలో నిత్యం బాగా యాక్టివ్ గా ఉంటున్న విషయం  మనకు తెలిసిందే. హాట్‌ ఫోటోలను షేర్‌ చేసుకుంటూ ఆద్యంతం  అందరినీ కట్టిపడేస్తుంటుంది. బోల్డ్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌ గా నిలుస్తుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: