మాటీవీలో ప్రసారమవుతున్న
బిగ్ బాస్ సీజన్ 6 ఆఖరిదశకు చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ షో కి ఎలాంటి పాపులారిటీ ఉందో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ షో ఇండియాలో ఎన్నో సీజన్లో కంప్లీట్ చేసుకుంది. అన్ని చోట్ల ఎన్నో సీజన్లు భారీ ప్రేక్షక ఆదరణ కూడా పొందాయి.. అయితే ఈ క్రమంలోనే ఈ షో మన తెలుగులో కూడా ప్రసారమయ్ చాలా పాపులారిటీ దక్కించుకుంది .తెలుగులో ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ షో మీద ఎలాంటి అంచనాలు లేవు. మొదలయ్యాక వన్ వీక్ తర్వాత ఒక రేంజ్ లో పాపులారిటీని దక్కించుకుంది. ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో ఈ షో బాగా పాపులర్ అవడానికి కారణం ఒక విధంగా
ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ షో ఈ వారంతో ఆరవ సీజన్ కూడా పూర్తి చేసుకుంటుంది. మొదటి సీజన్ లో యంగ్ టైగర్
ఎన్టీఆర్ పోస్ట్ గా చేశాడు .ఇక రెండవ సీజన్ కి నాచురల్ స్టార్
నాని హోస్ట్ గా వ్యవహరించారు. దాని అనంతరం మూడో సీజన్ నుంచి ఇప్పుడు కొనసాగుతున్న ఆరవ సీజన్ వరకు
నాగార్జున పోస్ట్ గా చేశారు. అందుకే
బిగ్ బాస్ నిర్వాహకులు ఇప్పుడు ఏడవ సీజన్ కోసం సరికొత్త హోస్ట్ ను తీసుకురావాలని చూస్తున్నారట.
బిగ్ బాస్ ఏడవ సీజన్ కూడా వచ్చే ఏడాది మధ్యలో మొదలయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుసుకున్నాయి. ఇక ఇప్పటినుండి ఈ సీజన్ కోసం
బిగ్ బాస్ టీం కొత్త హోస్టును వెతికే పనీలో పడ్డారని తెలుస్తుంది.
అయితే అది కూడా
టాలీవుడ్ కి చెందిన ఒక
యువ హీరో. ఇక ఈసారి హోస్ట్ గా యంగ్ హీరోని తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి .అయితే ఈసారి ఈ షో కి హోస్ట్ గా ఎవరు వ్యవహరిస్తారో చూడాలి. దీంతో వచ్చే ఏడాది ప్రారంభమయ్యే కొత్త సీజన్ లో ఎవరు హోస్ట్ గా వస్తారు అని
బిగ్ బాస్ అభిమానులు మరియు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో
బిగ్ బాస్ సీజన్ 7 కి సంబంధించిన ఈ వార్త కాస్త సోషల్
మీడియా వేదికగా వైరల్ గా మారింది..!!