
"ఇండియన్ 2" లో కమల్ హాసన్ పాత్ర గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన రకుల్..!
భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతున్న ఇండియన్ 2 మూవీ గురించి తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ కొన్ని కీలకమైన విషయాలను తెలియజేసింది. కమల్ హాసన్ ఈ మూవీ లో 90 ఏళ్ల వృద్ధిడి పాత్రలో నటిస్తున్నారు. దాని కోసం ఆయనకు ప్రోస్తేటిక్ మేకప్ ను వేస్తున్నారు. ఆ మేకప్ ను వేయడానికి నాలుగు ... ఐదు గంటల సమయం పడుతుంది. కమల్ హాసన్ 68 సంవత్సరాల వయసులో కూడా రోల్ టైం కంటే ముందే ఉదయం ఐదు గంటలకే చేరుకుంటారు. తద్వారా కమల్ హాసన్ ఉదయం 10 గంటల వరకు సెట్ లో ఉంటాడు అని తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఇండియన్ 2 మూవీ లోని కమల్ హాసన్ పాత్ర గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ ఎక్కువ శాతం బాలీవుడ్ సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పలు బాలీవుడ్ మూవీ లలో ఈ ముద్దు గుమ్మ నటించింది.