మంచు లక్ష్మి ని బలవంతంగా మొదటి భర్త తో విడగొట్టిన మోహన్ బాబు... అందుకేనా..!?

Anilkumar
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కి ఎలాంటి పేరోందో మనందరికీ తెలిసిందే. తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు ఈయన. అలాంటి వ్యక్తి తన కూతురు ప్రేమించిన వ్యక్తితో ఆమెను విడగొట్టాడు అనే వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకీ మోహన్ బాబు ఎందుకు అలా చేశాడో చూద్దాం ....కలెక్షన్ కింగ్  గా పేరు తెచ్చుకున్న ఈయన అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈయన వారసులు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తండ్రి లాగా పేరు తెచ్చుకోవాలని ట్రై చేశారు. కానీ తండ్రిలా మాత్రం పేరు తెచ్చుకోలేక పోయారు.

కూతురు లేటు వయస్సులో శృతిహాసన్ సిద్ధార్థ జంటగా వచ్చిన అనగనగా ఒక ధీరుడు అనే సినిమాలో విలన్ క్యారెక్టర్ తో అలరించింది. దాని అనంతరం గుండెల్లో గోదారి సినిమాతో మరియు బాలకృష్ణ మంచు మనోజ్ లో నటించిన ఊగుడతారు సినిమాల్లో నటించింది .ఈమధ్య మాన్స్టర్ అనే లెస్బియన్ పాత్రలో కూడా నటించింది. అయితే మంచు లక్ష్మి చదువుకునే రోజుల్లో లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది .ఎవరికి తెలియకుండా రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంది. విషయం తెలుసుకున్న మోహన్ బాబు తన కూతురిని ఆ వ్యక్తితో బలవంతంగా దూరం చేయడానికి బలవంతంగా వారిద్దరిని విడదీసి..

పై చదువుల కోసం మంచు లక్ష్మిని అమెరికా పంపించేశాడు. ఇలా మంచు లక్ష్మి తన మొదటి భర్తతో విడిపోవలసి వచ్చిందని అలాగే అమెరికా వెళ్ళాక అక్కడ మంచు లక్ష్మి శ్రీనివాస్ అనే మరో వ్యక్తితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారిందట. ఈ విషయం మోహన్ బాబు కి తెలియడంతో పెద్దల సమక్షంలో పెళ్లి కూడా జరిపించాడు. ఇలా మోహన్ బాబు తన కూతురి మొదటి పెళ్లిని చెడగొట్టాడు అనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: