మహేష్ సినిమాలో నారినారి నడుమ మురారి !

Seetha Sailaja
మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ముచ్చటగా మూడవసారి నిర్మాణం జరుపుకునే సినిమా షూటింగ్ ఈపాటికే ప్రారంభం కావలసి ఉంది. అయితే ఈమూవీ కథ ఫైనల్ అవ్వడంలో ఆలస్యం జరగడంతో పాటు మధ్యలో మహేష్ తల్లి ఆతరువాత అతడి తండ్రి కృష్ణ మరణించడంతో త్రివిక్రమ్ అనుకున్న విధంగా ఈమూవీ షూటింగ్ ముందుకు సాగడంలేదు.

ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలిగి పోవడంతో ఈమూవీ షూటింగ్ ను జనవరి మొదటి వారం నుండి మొదలు పెడుతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ఈసినిమా షూటింగ్ కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయట వినిపిస్తోంది. ఈసినిమా కథకు సంబంధించి అత్యంత కీలకమైన ఒక భారీ సెట్ ను హైదరాబాద్ చివరిలోని ఒక ప్రాంతంలో రెడీ చేస్తున్నాడని తెలుస్తోంది.

గతంలో నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ మూవీ కోసం హైదరాబాద్ చివరిలో వేసిన భారీ సెట్ ప్రాంతంలోని ఇప్పుడు మహేష్ త్రివిక్రమ్ ల మూవీ భారీ సెట్ నిర్మాణం కూడ జరుగుతోంది అని అంటున్నారు. త్రివిక్రమ్ తన సంభాషణలను చాల పొదుపుగా వాడుతాడు అన్న పేరు ఉంది. అయితే త్రివిక్రమ్ సినిమాలలోని సెట్స్ మాత్రం అత్యంత భారీగా చాల ఖరీదైన బడ్జెట్ తో నిర్మిస్తూ ఉంటారు.

‘అత్తారింటికి దారేదిలో’ సునంద ఇల్లు ‘సన్నాఫ్ సత్యమూర్తి’ లో దేవరాజ్ ఇల్లు ‘అ ఆ’ సినిమాలో ఆనంద్ విహారి ఇల్లు చాల డిఫరెన్ గా భారీ సెట్స్ తో కనిపిస్తాయి. ఇక ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో ఇల్లు అంటే ఆసినిమా ఘన విజయంలో ఆ భారీ సెట్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇప్పుడు త్రివిక్రమ్ మహేష్ తో తీస్తున్న లేటెస్ట్ మూవీలో త్రివిక్రమ్ సినిమాలలో ఇప్పటి వరకు ఎవరు చూడని భారీ సెట్ ను ప్రేక్షకులు చూడబోతున్నారని తెలుస్తోంది. ఈమూవీ కథలో పూజా హెగ్డే శ్రీలీలలు మహేష్ ను ప్రేమిస్తూ ఆట పట్టించే సన్నివేశాలు చూసిన వారికి ఒకప్పుడు బాలకృష్ణ నటించిన ‘నారీ నారీ నడుమమురారీ’ మూవీ గుర్తుకు వస్తుంది అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: