వాల్తేరు వీరయ్య నుంచి లేటెస్ట్ అప్డేట్.. ఫ్యాన్స్ కి పూనకాలే..!
ఇప్పటివరకు విడుదల చేసిన సినిమా పోస్టర్లను చూస్తుంటే ఈ సినిమా మాస్ ఎంటర్టైన్మెంట్ తరహాలో తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్ రావడం గమనార్హం. చిరంజీవి - శృతిహాసన్ మధ్య సినిమాలోని లాస్ట్ పాటను చిత్రీకరించినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఫ్రాన్స్ లో వాల్తేరు వీరయ్య పాట కోసం చిరంజీవి - శృతిహాసన్ మధ్య ఒక పాట షూట్ చేయబోతున్నారట. ఇక ఈ పాట షూటింగ్ అయిపోయిన తర్వాత తదితర పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేస్తున్నారు అని , ఆ తర్వాత వీఎఫ్ఎక్స్ కూడా కంప్లీట్ చేయబోతున్నట్లు సమాచారం.
ఎలాగో జనవరి 13వ తేదీకి కేవలం కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో త్వరగా ఈ సినిమాకి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసి సినిమా విడుదలకు ఉంచాలని నిర్మాతలు కూడా చాలా వేగంగా పనులు చేస్తున్నారు. మరి అనుకున్న సమయానికి అన్ని పనులు పూర్తి చేసి సినిమాను విడుదల చేయనున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాకి ఇప్పుడు బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా పోటి రాబోతుండడంతో రెండింటిలో ఏ సినిమా విజయాన్ని సాధిస్తుందో అనే ఉత్కంఠ కూడా అభిమానులలో నెలకొంది.