మేనేజర్ కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మాస్ మహారాజ్...!!

murali krishna
సినిమా స్టార్స్ దర్శకులకు, తమ చిత్రయూనిట్ కు గిఫ్ట్ ఇవ్వడం ఈ మధ్య చాలా చూస్తున్నాం. మొన్నామధ్య అల్లు అర్జున్ పుష్ప టీమ్ కు గిఫ్ట్స్ ఇచ్చాడు.. అలాగే చరణ్ కూడా ఆచార్య టీమ్ కు గిఫ్ట్స్ ఇచ్చాడు. ఆ తర్వాత కొంతమంది బడా ప్రొడ్యూసర్లు దర్శకులకు గిఫ్ట్స్ ఇవ్వడం కూడా చూశాం. ఇక హీరోలు కూడా తమ దర్శకుల కు.. తమ దగ్గర పని చేసే వారి కి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. కాస్ట్లీ  కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా మాస్ మహారాజా ర వితేజ కూడా ఇప్పుడు మంచి మనసు చాటుకొని హాట్ టాపిక్ అయ్యారు. తన మేనేజర్ కు కారు గిఫ్ట్ ఇచ్చారు రవితేజ. మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమా లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. తాజాగా తన మేనేజర్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చి అతడిని సంతోషపరిచాడు.
రవితేజ తన దగ్గర ఎంతో కాలం గా పని చేస్తున్న మేనేజర్ కు టాటా కంపెనీకి చెందిన కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దాంతో ఆ మేనేజర్ ఫ్యామిలీ ఆనందాన్ని వ్ వ్యక్తం చేశారు.  ఈ క్రమంలో ఆ మేనేజర్ తన ఫ్యామిలీ తో కలిసి కారు వద్ద తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ కారులో ఫస్ట్ డ్రైవ్ రవితేజను కోరగా రవితేజ కారును డ్రైవ్ చేశారు.
మాస్ మహారాజ సినిమాల విషయాని కొస్తే ప్రస్తుతం  రవితేజ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ గా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా ధమాకా సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: