'అవతార్-2' వర్సెస్ ' ఆక్రోశం '.....!!

murali krishna
`ఏనుగు` చిత్రంతో తెలుగులో మంచి ఆదరణ పొందాడు అరుణ్‌ విజయ్‌. విలన్‌గా, హీరోగా నటిస్తూ ఆకట్టుకుంటున్నారాయన. తెలుగులో మంచి మార్కెట్‌ ఏర్పర్చుకున్న అరుణ్‌ విజయ్‌ ప్రస్తుతం `ఆక్రోశం`(తమిళంలో- సినం) సినిమాతో రాబోతున్నారు.
ఆయన హీరోగా నటించిన ఈ చిత్ర రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. అయితే ఇది `అవతార్‌ 2`తో పోటీ పడుతుండటం విశేషం. అరుణ్‌ విజయ్‌, పల్లక్‌ లల్వాని జంటగా నటించగా, జీఎస్‌ కుమార వేలన్‌ దర్శకత్వం వహించారు. ఆర్‌ విజయ్‌ కుమార్‌ నిర్మించారు. తెలుగులో సి.హెచ్‌ సతీష్‌ కుమార్‌ విడుదల చేస్తున్నారు.
బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో హీరో అరుణ్‌ విజయ్‌ మాట్లాడుతూ, `డిసెంబర్ 16న రిలీజ్ అవుతున్న మా 'ఆక్రోశం' సినిమాకు తెలుగు ఆడియెన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని ఎగ్జయిటింగ్‌గా ఉంది. నిజానికి డిసెంబర్ 9న రిలీజ్ చేయాలనుకున్న ఈ సినిమాను డిసెంబర్ 16న రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకు కారణం..ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాలనేదే మా ఆలోచన. వీలైనన్ని ఎక్కువ థియేటర్స్‌లో మూవీని రిలీజ్ చేయాలనుకుంటున్నాం. మహిళలు, అమ్మాయిలు, కుటుంబ సభ్యులు అందరూ ఈ సినిమాను ఎంతగానో ఎంజాయ్ చేస్తారు. సినిమాలో మంచి మెసేజ్ ఉంటుంది. ఇదొక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్. చక్కటి మెసేజ్ ఉంటుంది.
`ఏనుగు` సినిమా సమయంలో సతీష్‌గారితో అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు ఆయనే `ఆక్రోశం` సినిమాను రిలీజ్ చేయనుండటం చాలా సంతోషంగా ఉంది. మంచి కంటెంట్ ఉంటే తెలుగు ఆడియెన్స్ సినిమాను ఆదరిస్తుంటారు. సినిమా థియేటర్స్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు ఓ ఎమోషన్‌తో బటయకు వెళతారు. షబీర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. మంచి పాటలు కుదిరాయి. సిల్వగారు యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ప్లస్ అవుతుంది. మధు అనే పాత్రలో పల్లక్ లల్వాని అద్భుతంగా నటించింది. తన పాత్ర చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది` అని చెప్పారు.
నిర్మాత సి.హెచ్‌.సతీష్ కుమార్ మాట్లాడుతూ, `ఆక్రోశం` మూవీ తల్లి, తండ్రి, భర్త, భార్య, కొడుకు ఇలా కుటుంబంలోని అన్ని ఎమోషన్స్‌ను బ్యాలెన్స్‌ను చూపిస్తూ అందరూ కలిసి చూసే విధంగా ఉంటుంది. దీంతో పాటు సినిమాలో మంచి యాక్షన్ ఎలిమెంట్స్ ఉంటాయి. తప్పకుండా అందిరకీ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్‌తో చేసిన సినిమా కాట్టి ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ప్రస్తుతం మన సమాజానికి చెప్పాల్సిన కొన్ని పాయింట్స్‌ను కథ రూపంలో చక్కగా తెరకెక్కించారు డైరెక్టర్ కుమార వేలన్‌. డిసెంబర్ 16న థియేటర్స్‌లో మా సినిమాను తీసుకొస్తున్నాం. ప్రేక్షకులు మా సినిమాను ఆశీర్వదిస్తారని భావిస్తున్నాం` అని తెలిపారు.
హీరోయిన్ పల్లక్ లల్వాని మాట్లాడుతూ , `టాలీవుడ్ అంటే నాకు ఎంతో స్పెషల్‌. హైదరాబాద్‌కి వచ్చిన ప్రతీసారి నా ఇంట్లో ఉన్న అనుభూతి కలుగుతుంది. తమిళంలో ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు ఆడియెన్స్ కూడా సినిమాను ఆదరిస్తారని భావిస్తున్నాం. మూవీలో మధు అనే రోల్ చేశాను. ఆదరించాలని కోరుకుంటున్నా` అని చెప్పింది. అరుణ్ విజయ్‌, పల్లక్ లల్వాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కాళీ వెంకట్‌, ఆర్‌.ఎన్‌.ఆర్‌. మనోహర్‌, కె.ఎస్‌.జి. వెంకటేష్‌, మరుమలార్చి భారతి తది తరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు షబీర్‌ తబరే ఆలం సంగీతం అందించారు. గోపీనాథ్ సినిమాటోగ్రఫీ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: