నటీనటులకు అదిరిపోయే బహుమతులు అందించిన సర్దార్ టీమ్..!
తర్వాత లైలా మరణిస్తుంది.. కార్తీక్ దీనిని చాలెంజ్‌గా తీసుకొని ఎలా చేదించగలిగాడు అనేది సినిమా కథ.. దీనిని చూసిన తర్వాత వాటర్ బాటిల్ లోని నీళ్లు తాగాలంటే కూడా భయం వేస్తోందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరొక పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది. ఈ సినిమా యాక్షన్, ఎమోషనల్ సీన్లను జీవీ తన సంగీతంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాను.. ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించిందని మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.
ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా భారీ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న నేపథ్యంలో చిత్రబృందం నటీనటులందరికీ కూడా 30 వేల రూపాయల విలువైన వెండి వాటర్ బాటిల్‌ను బహుమతిగా అందించినట్లు సమాచారం . ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.