ఆ తేదీన "ప్రేమదేశం" మూవీ రీ రిలీజ్..!

Pulgam Srinivas
అలనాటి కాలంలో సూపర్ హిట్ గా నిలిచిన ప్రేమ దేశం మూవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ కాదల్ దేశం అనే తమిళ మూవీ కి డబ్బింగ్. తమిళం లో కాదల్ దేశం పేరుతో విడుదల అయిన ఈ సినిమా తెలుగు లో ప్రేమ దేశం పేరుతో విడుదల అయింది. ఈ మూవీ లో అబ్బాస్ , వినీత్ , టబు ముఖ్య పాత్రలలో నటించగా , కదిరి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. 30 ఆగస్టు 1996 వ తేదీన ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు భాషలలో భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా , అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే అప్పట్లో తమిళ్ మరియు తెలుగు ప్రేక్షకులను అత్యంత అలరించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీన థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను తాజాగా ఈ మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 9 వ తేదీన "ఎ ఎం బి" మాల్ లో రీ రిలీజ్ చేయనున్నారు. దానితో ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఆన్లైన్ బుకింగ్ లను కూడా ఓపెన్ చేశారు. రీ రిలీజ్ లో భాగంగా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. ఈ మూవీ కి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ మూవీ విజయంలో ఏ ఆర్ రెహమాన్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: