అల్లు అర్జున్ తో మూవీ తీయాలని ఉంది... బాలీవుడ్ డైరెక్టర్..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం అల్లు అర్జున్ "పుష్ప" అనే పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా , నేషనల్ క్రష్ రష్మిక మందన ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించింది. అనసూయ , సునీల్ , రావు రమేష్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించగా , రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.

టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటు వంటి సమంత ఈ మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలై భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీ ద్వారా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. పుష్ప పార్ట్ 1 మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకుని ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఓ బాలీవుడ్ దర్శకుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఒక మూవీ చేయాలని ఉంది అని చెప్పుకొచ్చాడు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి రోహిత్ శెట్టి నాకు దక్షిణాది స్టార్ హీరోల అందరితో మూవీ లు తీయాలని ఉంది అని ,  మరి ముఖ్యంగా అల్లు అర్జున్ , విజయ్ , కార్తీ లతో పని చేయడం చాలా ఇష్టం అని చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రోహిత్ శెట్టి "సర్కస్" అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: