"మగధీర" మూవీ కథ విన్నాక నాన్న రియాక్షన్ అదే రామ్ చరణ్..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ ఇప్పటికే అనేక బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి తనకంటూ ఇప్పటికే నటుడు గా అద్భుతమైన గుర్తింపు ను దక్కించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. దానితో ఈ మూవీ అద్భుతమైన కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ తో రామ్ చరణ్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అవార్డ్ లభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ అవార్డ్ వేడుకలో భాగంగా రామ్ చరణ్ చాలా రోజుల క్రితం రాజమౌళి మరియు చిరంజీవి ల మధ్య జరిగిన ఒక సరదా సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రాజమౌళి దర్శకత్వం లో మగధీర మూవీ తెరకెక్కి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న అందరికీ తెలిసిందే.  రాజమౌళి , మగధీర మూవీ కథను నాన్న గారికి చెబుతూ ఉంటే , ఆ కథలో లీనం అయిపోయారు. సగం కథ విన్నాక ఆ సన్నివేశం ఎలా చేయాలి అని అడిగాడు. సార్ అది మీకు కాదు అని రాజమౌళి చెప్పడంతో అందరం నవ్వుకున్నాం అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: