"ఆర్ఆర్ఆర్" మూవీలోని ఆ సీన్ కి 40 రాత్రులు పట్టింది... రాజమౌళి..!

Pulgam Srinivas
భారతదేశంలో ఉన్న టాప్ డైరెక్టర్ లో ఒకరు అయినటు వంటి ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ఇప్పటివరకు తన కెరీర్ లో దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోను బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని ప్రస్తుతం ఇండియా లోనే టాప్ డైరెక్టర్ ల లిస్ట్ లో చేరిపోయాడు. ఇది ఇలా ఉంటే రాజమౌళి తాజాగా ఆర్ ఆర్ ఆర్ అనే భారీ బడ్జెట్ ప్యాంట్ ఇండియా మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో లుగా నటించగా ,  ఆలియా భట్ , ఒలివియా మోరిస్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. సముద్ర కని ,  అజయ్ దేవగన్ ,  శ్రేయ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించగా , ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ఈ మూవీ ను డి వి వి ఎంటర్టైన్మెంట్ నుండి బ్యానర్ పై నిర్మించాడు.

ఎం ఎం కీరవాణి ఈ మూవీ కి సంగీతం అందించాడు. కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా  తెలుగు , తమిళ ,  కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా రాజమౌళి ఈ మూవీ లోని ఒక సన్నివేశం గురించి చెప్పుకొచ్చాడు. తాజాగా ఎస్ ఎస్ రాజమౌళి "ఆర్ ఆర్ ఆర్" మూవీ లోని ఎన్టీఆర్ కు సంబంధించిన ప్రీ ఇంటర్వెల్ సన్నివేశానికి ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు అని ,  అయితే ఆర్ ఆర్ ఆర్ మూవీ లోని ఆ సన్నివేశాన్ని సక్సెస్ ఫుల్ షూట్ చేయడానికి ఏకంగా 40 రాత్రుల సమయం పట్టింది అని తాజాగా రాజమౌళి చెప్పుకొచ్చాడు. అలాగే దాదాపు ఆ సీన్ కోసం 2000 టెక్ లను తీసుకున్నట్లు రాజమౌళి చెప్పుకొచ్చాడు. అది నిజంగా ఒక పీడకల వంటిదని రాజమౌళి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: