గుర్తుందా శీతాకాలం ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడంటే..?
ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించిన సత్యదేవ్ ఇప్పుడు గుర్తుందా శీతాకాలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో మిల్క్ బ్యూటీ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది.. డిసెంబర్ 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ చేపట్టనున్నారు అంతే కాదు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనౌన్స్మెంట్ కూడా ఈరోజు ఇచ్చే అవకాశం ఉంది. మరి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా ఎవరు హాజరవుతున్నారో సస్పెన్స్ అన్నట్టుగా చిత్ర బృందం ప్రకటించినట్లు సమాచారం.
ఇకపోతే రొమాంటిక్ లవ్ స్టోరీ గా సాగుతున్న ఈ సినిమా మరో గీతాంజలి అని ప్రేక్షకులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఫస్ట్ లవ్ అనేది వారికి ఎంతో మధురమైన అనుభవంగా గుర్తుండిపోతుంది.అలాంటి రొమాంటిక్ క్షణాలను గుర్తుకు తెచ్చుకునేలా ఈ సినిమా ట్రైలర్ యువతను బాగా ఆకట్టుకుంది. "లవ్లో ప్రాబ్లం ఉంటే ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవచ్చు.. కానీ లవరే ప్రాబ్లం అయితే" అనే డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. అంతేకాదు" మరీ అందంగా ఉంది రా.. మన రేంజ్ కాదురా.." లాంటి సంభాషణలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచేస్తున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.