రామ్ చరణ్ పై బాగా ఎమోషనల్ అయిన చిరంజీవి..!!
తాజా గా రామ్ చరణ్ ది ట్రూ లెజెండ్ ఫ్యూచర్ యంగ్ ఇండియా అవార్డుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంపికయ్యారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలో నే రామ్ చరణ్ ఈ అవార్డు ను అందుకోవడం తో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ అవార్డు అందుకున్న అనంతరం ఇందుకు సంబంధించిన ఫోటోలు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బాగా ఎమోషనల్ కామెంట్స్ కూడా చేశారు అని చెప్పొచ్చు.
ఈ సందర్భం గా చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. నాన్న.. నిన్ను చూస్తుంటే నాకు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఎంతో ప్రతిష్టాత్మకమైన ట్రూ లెజెండ్ అవార్డు సొంతం చేసుకున్న తర్వాత నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది.భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో గొప్ప అవార్డులను సొంతం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ చిరంజీవి తన కుమారుడు అందుకున్న ప్రతిష్టాత్మకమైన అవార్డు పట్ల ఎమోషనల్ కామెంట్స్ చేస్తూ చేసినటువంటి ఈ పోస్ట్ ఎప్పుడు బాగా వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే మెగా అభిమానులు సైతం రాంచరణ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తు పోస్టులు కూడా పెడుతున్నారు.