బాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన కత్రినా కైఫ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమెకు ఉన్న స్టార్ హీరోయిన్ స్టేటస్ తో కోట్లాది రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ యాక్టర్స్ గా మారింది. అనంతరం ఈమె యాక్టర్ విక్కీ కౌశల్ ని వివాహం చేసుకుంది .ఇక ఆ తర్వాత కెరియర్ కంటిన్యూ చేస్తుందో లేదో చూడాలి ఇప్పుడు కత్రినా కైఫ్ ను తెలుగు ఇండస్ట్రీ కొన్ని కారణాల వల్ల బ్యాన్ చేసిందని వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే విక్టరీ వెంకటేష్ సరసన హీరోయిన్గా మల్లేశ్వరి సినిమాలో నటించిన సంగతి తెలిసిందే కదా .
కత్రినా ఈ సినిమాకి తీసుకున్న పారితోషకం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది .అయితే అప్పట్లో దాదాపు కోటి రూపాయలు రెమ్యూనరేషన్ గా తీసుకుంది. ఇక ఆ సినిమా షూటింగ్లో భాగంగా ఈమె షూటింగ్ కి ఎప్పుడు లేటుగా వస్తుందని వెంకీ బ్రదర్ నిర్మాత సురేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీంతోపాటు ఆమె హైట్ కి సంబంధించిన వార్తలు కూడా కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .అయితే ఈమె వెంకటేష్ బాలకృష్ణ ఇద్దరితో నటించినప్పటికీ బాలకృష్ణతో నటించినప్పుడే ఆమెకి ఎక్కువ కామెంట్స్ రావడం జరిగింది. హీరోయిన్ ఏంటి ఇంత హైట్ ఉంది ...
ఆమె పక్కన హీరోలు నిచ్చెన వేసుకోవాలి ...ఆమెకి ఉన్న మైనస్ పాయింట్ అల్లా ఆమె హైట్ అని చాలా ట్రోల్స్ రావడం జరిగింది. అయితే ఈ కారణంగానే కత్రినా కైఫ్ టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు మొదటి సినిమాకి ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోవడం మన నిర్మాతలు జీర్ణించుకోలేకపోయారు .దీంతోపాటు ఆమె దర్శక నిర్మాతలను ఎల్లప్పుడూ ఇబ్బందులకు గురిచేస్తుంది అనే వార్తలు రావడంతో స్టార్ హీరో ఎవరు ఆమె సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపలేదు. ఇక దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది..!!