'జాతిరత్నాలు' డైరెక్టర్ చెప్పులు ఎందుకు వేసుకోడు?.. దీని వెనక అసలు రీజన్ తెలిస్తే షాక్ అవుతారు..?.

Anilkumar
పిట్టగోడ అనే ఒక్క సినిమా తీసి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు అనుదీప్ కె.వి. పిట్టగోడ సినిమా పెద్దగా హిట్ అవ్వకపోయినప్పటికీ ఆయన తరువాత తీసిన జాతి రత్నాలు సినిమా తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా ప్రిన్స్ సినిమాతో మళ్లీ తన టాలెంట్ ను చూపించుకున్నాడు అనుదీప్ కె.వి. అంతేకాదు ఆయన ప్రవర్తనతో అంతకంటే ఎక్కువ ఫేమస్ అయ్యాడు ఈయన. ఇటీవల క్యాష్ ప్రోగ్రామ్ తో అనుదీప్ ఒకేసారి స్టార్ అయిపోయాడు .ఆయన ఏ ఇంటర్వ్యూకి వెళ్లినా కూడా వారికి కావాల్సినంత కంటెంట్ ఇస్తుంటాడు. ఆయన ఏం చదువుకున్నాడు

 ఆయన క్వాలిఫికేషన్ ఏంటన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది. అయితే ఈయనను ఎప్పుడూ ఈ ప్రశ్న అడిగినా కూడా నోటికి వచ్చిన సమాధానం చెబుతుంటాడు .ఇలా చిత్ర విచిత్రమైన పనులు చేస్తూ అనేకమైన అభిమానాన్ని పొందాడు. ఇక అసలు విషయం ఏంటంటే అనుదీప్ ఎప్పుడు కూడా చెప్పులు వేసుకున్నట్టు కనిపించలేదు .ఇక దీని గురించి ఎప్పుడు అడిగినా కూడా ఏదో ఒక సమాధానం చెబుతూ ఉంటాడు .అయితే దీని గురించి అతని సన్నిహిత వర్గాల నుంచి ఇప్పుడు కొంత సమాచారం వినిపిస్తోంది. అదేంటంటే క్లింట్ ఒబెర్ రాసిన ఎర్తింగ్ అనే పుస్తకం

 చదివి సిందటిక్ వచ్చిన తరువాత భూమికి మనిషికి ఉన్న కనెక్టివిటీ మిస్ అవుతుందని తెలుసుకుని అనుదీప్ కేవి చెప్పులు వేసుకోవడం మానేసాడట. అయితే ఎంత కామెడీగా మాట్లాడినప్పటికీ కొన్ని విషయాలపై చాలా పట్టు ఉంటుందని ఇటీవల సీనియర్ జర్నలిస్టు ప్రేమ చేసిన ఇంటర్వ్యూ ద్వారా తెలిసింది. దీంతోపాటు ఆ ఇంటర్వ్యూలో ఆయన తనకి హైలీ సెన్సిటివ్ పర్సన్ డిసార్డర్ ఉందని చెప్పాడు. ఇక ఈ డిసార్డర్ ఉన్నవారు త్వరగా అలసిపోతారని ఎక్కువ ఫోకస్ ఉన్న లైట్స్ చూసిన ..ఘాటైన వాసన పీల్చిన.. కూడా బాగా ఇబ్బంది పడతారని ఆయన తెలిపాడు .ఇక దీంతో ఈయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: