టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ సింగర్ గా పేరు ప్రఖ్యాతలను పొందిన సునీత గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇదిలా ఉంటే ఇక ఈమె మొదటి వివాహం విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్న సంగతి మనందరికీ తెలిసిందే.. దాని అనంతరం దాదాపు 15 సంవత్సరాల తర్వాత తన స్నేహితుడైన మ్యాంగో మీడియా అధినేత రామ్ వీరపనేని ని రెండో వివాహం చేసుకోవడం జరిగింది.. రెండవ వివాహం అనంతరం సింగర్ సునీత తన సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా ఉండడం ప్రారంభించింది.. ఆమెకి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆమె అభిమానులతో పంచుకోవడం మొదలుపెట్టింది సునీత..
ఇందులో భాగంగానే తాజాగా ఈమె తన సోషల్ మీడియా వేదికగా ఒక అద్భుతమైన ఫోటోను షేర్ చేస్తూ ఆమె గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి చెప్పడం జరిగింది.. ఈ క్రమంలోనే సింగర్ గా మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తనకు డైరెక్టర్లు పిలిచి మరీ హీరోయిన్గా అవకాశం ఇస్తే వారి ముఖం మీద డోర్ వేసిందని.. నటించను అని చెప్పిందట. అసలు విషయంలోకెళితే గులాబీ సినిమాలో 'ఈ వేళలో నీవు' పాట సక్సెస్ అయిన తర్వాత రాంగోపాల్ వర్మ తన సినిమా కోసం సునితను హీరోయిన్గా అనుకున్నారు. ఆ తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఈమెకు హీరోయిన్ అవకాశం ఇవ్వాలని అనుకున్నప్పటికీ కూడా ఆమె అవకాశాన్ని అంగీకరించలేకపోయింది.
ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ..హీరోయిన్ గా లేదా నటిగా ఇండస్ట్రీలోకి రాకపోవడానికి కారణం తరచూ ఇండస్ట్రీలో హీరోయిన్లు అలాగే నటీమణులు పడే కష్టాలు దగ్గర్నుంచి చూస్తున్నాను.. మళ్ళీ అలాంటి కష్టాలు నేను పడాలనుకోవట్లేదు.. నేను మనశ్శాంతిగా , సంతోషంగా, ఎటువంటి గొడవలు లేకుండా నా జీవితం సాగాలని కోరుకుంటున్నాను.. అందుకే ఇండస్ట్రీలో ఎంత మంచి అవకాశం వచ్చినా నటించను ' అంటూ తేల్చి చెప్పింది సింగర్ సునీత.. సింగర్ గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వ్యాఖ్యాతగా పలు షో లకు జడ్జిగా కూడా వ్యవహరించి మరింత గుర్తింపును సంపాదించుకున్నారు.. ఈమె గులాబీ సినిమా ద్వారా తన సింగర్ కెరియర్ ను మొదలు పెట్టడం జరిగింది.. ఆ తర్వాత డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సుమారు 700 చిత్రాలకు పైగా పనిచేయడం జరిగింది.. అంతేకాదు దాదాపు మూడు వేలకు పైగా పాటలను పాడి మరింత పాపులారిటీ దక్కించుకుంది..!!