టాలీవుడ్ సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అనేక సినిమాల్లో నటించి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మోహన్ బాబు ఆయన ఇద్దరు కొడుకులు కూడా సినీ ఇండస్ట్రీలో హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే.. ఇదిలా ఉంటే ఇక ఈ కుటుంబం ఎల్లప్పుడూ ఏదో ఒక విషయమై వార్తల్లో నిలుస్తూ ఉంటారు అన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా.. అయితే గత కొంతకాలంగా ఈ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి అని వార్తలు వస్తున్నాయి..
ఇక దీనికి కారణం మంచు మనోజ్ భూమా మౌనికను ప్రేమించడమే అంతే కాదు ఈమెతో పెళ్లి గురించి మనోజ్ ఇంట్లో గొడవ చేయడం దీంతో మంచు మనోజ్ ఆయన కుటుంబానికి దూరమయ్యాడు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో రావడం జరిగింది.. అంతేకాకుండా తండ్రి మాటకు అడ్డు చెప్పని మంచు విష్ణు కూడా తమ్ముడుతో మాట్లాడడం లేదని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.. అయితే ఈ గొడవ జరిగిన అనంతరం మంచు మనోజ్ మంచు కుటుంబంతో కలిసి ఉండడం లేదట.. అయితే ఇప్పుడు మళ్లీ మంచు మనోజ్ తల్లిదండ్రులతో కలవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది..
అయితే ఇటీవల మంచు విష్ణు ఆయన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసింది కదా.. అయితే ఈ సందర్భంగా మంచు విష్ణు కి మంచు మనోజ్ బర్త్డే విషెస్ ను చెప్పడం జరిగింది కాగా దానికి మంచు విష్ణు ఏమాత్రం స్పందించలేదు.. అయితే ఇక నేడు మంచు విష్ణు కుమార్తెల పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ వారికి బర్త్డే విషెస్ ను తెలిపాడు.. అయినా సరే దీనికి కూడా మంచు కుటుంబం ఏమాత్రం స్పందించలేదు.. ఇక మంచు మనోజ్ మంచు కుటుంబానికి దగ్గర అవ్వాలని చూస్తున్నా కూడా అది సాధ్యం కావడం లేదంటూ వార్తలు వినిపిస్తున్నాయి..!!