ప్రభాస్ కోసం అన్ని కోట్లు ఖర్చుపెట్టి సెట్ ను సిద్ధం చేస్తున్న మారుతి..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలు చేస్తున్నాడు.. ఇలా ఉంటే ఇప్పుడు ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్లో రానున్న సినిమా కోసం ఆయన అభిమానులు మరియు ప్రేక్షకులు సైతం ఎంతలా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఇకపోతే ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా హారర్ మరియు కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.. అంతేకాదు ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.. ఇక ప్రభాస్ ఇలాంటి ఒక సినిమాలు నటించడం

 ఇదే మొదటిసారి కావడం గమనార్హం.. అయితే ప్రభాస్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో... సినిమా కథ మొత్తం ప్రభాస్ తాతగారికి సంబంధించిన ఒక థియేటర్ చుట్టూ తిరగబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఈ నేపథ్యంలోనే ఈ థియేటర్ కి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇక అదేంటంటే  చిత్ర బృందం ఈ సినిమాకి సంబంధించి ఒక పాతబడిన థియేటర్ సెట్ ను సిద్ధం చేస్తోందట.. అంతేకాదు ఈ సెట్ కోసం చిత్ర బృందం ఏకంగా 10 కోట్ల రూపాయలను ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి..

 అంతేకాకుండా దాదాపు షూటింగ్ మొత్తం ఈసెట్ లోనే జరిగేటట్టుగా చిత్ర బృందం ప్లాన్ చేస్తోందట.. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి కావడం జరిగిందట.. ఇకపోతే పాన్ ఇండియా స్టార్ హీరో అయినా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మాళవిక మోహన్ మరియు నిధి అగర్వాల్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు అంతేకాదు ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా మూడో హీరోయిన్ గా రదే శ్యామ్ సినిమాలో నటించిన రిదీ కుమార్ కూడా కనిపించనుంది.. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని తెలుగు లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: